వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాడిదలతో స్కోడా కారును లాగించాడు, ఎందుకు?

సర్వీస్ సెంటర్ సక్రమంగా స్పందించని కారణంగా గాడిదలతో స్కోడా కారును లాగించి ఓ కారు యజమాని వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లూథియానా:తమ కంపెనీలకు చెందిన వస్తువులను విక్రయించేందుకుగాను ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేలా ప్రకటనలను గుప్పిస్తాయి.అయితే వాటిని కొనుగోలు చేసిన తర్వాత అవసరమైన సర్వీస్ ఇచ్చేందుకు ఆయా కంపెనీలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.

ఇదే తరహ ఘటన ఒకటి పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఆయా కంపెనీలు వస్తువులను విక్రయించే సమయంలో సర్వీస్ తో పాటు రిపేర్లు చేస్తామని ఊదరగొడతాయి.అయితే తీరా అవసరమైన సమయాల్లో పలు రకాలైన నిబంధనలను సాకుగా చూపుతారు.

ఉచిత సర్వీస్ కాదంటూ వినియోగదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తారు. ఈ తరహ మోసాలకు చెక్ పెట్టాలంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాల్సిందే.

skoda car owner variety protest against service and repair

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన ఓ వ్యక్తి స్కోడా కారును కొనుగోలు చేశాడు.తన స్కోడా కారు రిపేరు రావడంతో కంపెనీ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్ళాడు. అయితే అక్కడ కూడ సరిగా స్పందించలేదు.

కారుకు సర్వీస్ చేయడంలో సర్వీస్ సెంటర్ యాజమాన్యం తీరు పట్ల కారు యజమాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.తన ఆగ్రహన్ని కంపెనీకి తెలిసేలా చేయాలని ఆయన ప్లాన్ చేశాడు.సర్వీస్ సెంటర్ నుండి తన కారును గాడిదలతో లాక్కెళ్ళించాడు. గాడిదలతో స్కోడా కారునులాక్కెళ్ళించడం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.

English summary
Car owner in a unique protest against Skoda for not being able to provide adequate repair services,pulls his car with help of donkeys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X