చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై ఇన్స్ పెక్టర్ కాల్చివేత, సాటి ఇన్స్ పెక్టర్ పనే, కొత్త ట్విస్ట్: రాజస్థాన్ లో కథ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజస్థాన్ లో దోపిడి దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన చెన్నై పోలీసుల్లో ఇన్స్ పెక్టర్ పెరియపాండియన్ తుపాకీ కాల్పులకు మరణించిన ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. సాటి ఇన్స్ పెక్టర్ మునిశేఖర్ కాల్చడంతోనే పెరియపాండియన్ మరణించినట్లు రాజస్థాన్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.

చెన్నైలోని కొళత్తూరులోని ఓ బంగారు నగల దుకాణంలో సుమారు మూడు కేజీల బంగారు నగలు చోరీ అయిన కేసుకు సంబంధించి నిందితులను పట్టుకోవడానికి రాజస్థాన్‌ వెళ్లిన పోలీసుల బృందంలో చెన్నైలోని మదురవాయల్‌ ఇన్స్ పెక్టర్ పెరియపాండియన్‌ తుపాకీ తూటాలకు బలికాగా నలుగురు గాయపడిన విషయం తెలిసిందే.

 దోపిడీ దొంగల పని ?

దోపిడీ దొంగల పని ?

నిందితులను చుట్టుముట్టి వారిని పట్టుకునే ప్రయత్నంలో నిందితులు తుపాకీ కాల్పులకు దిగడంతో ఇన్స్ పెక్టర్ పెరియపాండియన్ మరణించినట్లు వార్తలు వినిపించాయి. పెరియపాండియన్‌ వద్ద ఉన్న తుపాకీని దోపిడీ దుండగలు లాక్కొని ఆయనపై కాల్పులు జరిపారని ప్రచారం జరిగింది. నగల దుకాణం చోరీ కేసులో ప్రధాన నిందితుడు నాథురామ్‌ ఈ కాల్పులకు పాల్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి.

పోలీసుల మీద దాడి ?

పోలీసుల మీద దాడి ?

ప్రత్యేక బృందంలోని కొళత్తూర్‌ ఇన్స్ పెక్టర్ మునిశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదును రాజస్థాన్‌ పోలీసులు నమోదు చేసుకున్నారు. ఓ పాడుబడిన ఫ్యాక్టరీలో దాగిన దుండగులను పట్టుకోవడానికి ముందుగా పెరియపాండియన్‌ తాను వెళ్లామని, ఆ సమయంలో దుండగులు తమపై కర్రలతో దాడి చేశానని మునిశేఖర్ రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఒక్క మాటతో అనుమానం

ఆ ఒక్క మాటతో అనుమానం

ఆ సందర్బంలో తుపాకీ కిందపడిపోగా దానిని పెరియపాండియన్‌ అందుకున్నాడని, ఇంతలో తమ బృందంలోని సహచరులు లోపలికి వచ్చి తనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని చెప్పారు. ఇన్స్ పెక్టర్ మునిశేఖర్ చెప్పిన ఆ ఒక్క మాటే రాజస్థాన్‌ పోలీసులకు అనుమానం కలిగించింది.

గాయాలు ఎలా అయ్యాయి ?

గాయాలు ఎలా అయ్యాయి ?

మునిశేఖర్‌ కథనం ప్రకారం తుపాకీ కాల్పులకు ముందే ఆయన్ను ప్రత్యేక బృందంలోని ఇతర సభ్యులు కాపాడి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు పెరియపాండియన్‌ మాత్రం దుండగులకు చిక్కాడు. అలాంటప్పుడు దుండగుల దాడిలో మిగిలిన నలుగురు పోలీసులు ఎలా గాయపడ్డారనే అనుమానం స్థానిక పోలీసులకు వచ్చింది.

 నాథురామ్ అనుచరులు

నాథురామ్ అనుచరులు

ఇప్పటికే రాజస్థాన్‌ పోలీసుల అదుపులో ఉన్న నాథురామ్‌ ముఠాకు చెందిన కొందరిని విచారించగా సహ ఇన్స్ సెక్టర్ కాల్చడంతోనే పెరియపాండియన్‌ మరణించినట్లు చెప్పారని తెలిసింది. పెరియపాండియన్‌ శరీరంలో తూటాలు ఇన్స్ పెక్టర్ మునిశేఖర్‌ పిస్తోల్‌లోనిదని గుర్తించడంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది.

మునిశేఖర్ పనే, జిల్లా ఎస్పీ !

మునిశేఖర్ పనే, జిల్లా ఎస్పీ !

ఇన్స్ పెక్టర్ మునిశేఖర్‌ పిస్తోల్‌లోని తూటా దూసుకొచ్చే పెరియపాండియన్‌ మరణించినట్లు రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఎస్పీ దీపక్‌ భార్గవ్ చెప్పారు. పెరియపాండియన్‌, మునిశేఖర్‌ పిస్తోల్‌లను పరిశీలించిన తర్వాత జిల్లా ఎస్పీ దీపక్ బార్గవ్ ఈ వివరాలు వెల్లడించారని సమాచారం.

నిర్లక్షం ఒకరి ప్రాణం తీసింది

నిర్లక్షం ఒకరి ప్రాణం తీసింది

విచారణలోని వచ్చిన సమాచారం, మునిశేఖర్‌ ఇచ్చిన సమాచారంలో వైరుద్ధ్యం ఉండటంతో మునిశేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించాలని రాజస్థాన్ పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. విధి నిర్వహణలో అజాగ్రత్తగా ఉండటంతో ఒకరి ప్రాణం పోయిందని ఆరోపిస్తూ ఇన్స్ పెక్టర్ మునిశేఖర్‌ మీద రాజస్థాన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

పిస్తోల్ లాక్ రిలీజ్ అయితే !

పిస్తోల్ లాక్ రిలీజ్ అయితే !


ఇన్స్ పెక్టర్ మునిశేఖర్ దగ్గర ఉన్న పిస్తోల్ 9 ఎంఎం రకానికి చెందినది. 9 ఎంఎం పిస్తోల్ లాక్ ఒక్క సారి రిలీజ్ అయితే 20 తుటాలు పేల్చ వచ్చని పోలీసు అధికారులు చెప్పడం అనేక అనుమానాలకు అవకాశం ఇస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ విషయం చెన్నై పోలీసు అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.
తన భర్తను సాటి ఇన్స్ పెక్టర్ మునిశేఖర్ కాల్చి చంపాడని వస్తున్న వార్తల్లో ఏది నిజం అనే విషయం మునిశేఖర్ చెప్పాలని పెరియపాండియన్ భార్య భానురేఖ డిమాండ్ చేస్తున్నారు.

English summary
Banurekha, wife of slain police inspector Periyapandiyan, has expressed shock over reports which claimed that her husband was not shot at by robbers in Rajasthan, but by his own colleague Munisekar by mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X