వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులు: చికిత్స పొందుతూ ఎన్ఐఏ అధికారి భార్య మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్ఐఏ అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మాద్ (44) చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె బుధవారం ఉదయం 11 గంటకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూరులో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్‌ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య ఫర్జానా తీవ్ర గాయాలు పాలయ్యారు.

slain nia officer wife dies at aiims delhi

దీంతో ఆమెను హుటాహుటిన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం మృతి చెందారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కీలక నిందితులు మాత్రం పరారీలోనే ఉండటం విశేషం. అయితే దుండగులు వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారి దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
The wife of NIA officer Tanzil Ahmed who was shot dead two weeks back succumbed to injuries at hospital today. Farzana aged 40 died at the AIIMS traums centre at 11 am today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X