వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీది బానిస మనస్తత్వం.. అందుకే ట్రంప్‌కు దాసోహం.. గరీబీ చుపావో మోదీ నినాదం..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మోదీ సర్కారు చేస్తున్న పిచ్చిపనుల్ని చూసి ప్రపంచం నవ్వుకుంటున్నదని, స్వాతంత్ర్యం రావడానికి ముందు, బ్రిటన్ రాణికి ఇండియాలో స్వాగతం పలికినట్లు.. ఇప్పుడు మోదీ.. ట్రంప్ కోసం ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని, తద్వారా బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారని శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విమర్శించింది.

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | Kohli @10 KL Rahul @2 Spot | Vodafone Idea Shutdown

శివసేన పార్టీ అధికారిక దినపత్రిక 'సామ్నా' సోమవారం నాటి ఎడిటోరియల్ లో మోదీ సర్కారుపై నిప్పులు చెరిగింది. అహ్మదాబాద్ లో ట్రంప్ జరిపే కేవలం 3 గంటల పర్యటనకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తుండటం దారుణమని, దీనికి కచ్చితంగా జవాబుచెప్పాలని సేన డిమాండ్ చేసింది. ట్రంప్ ప్రయాణించనున్న మార్గంలో పలు చోట్ల గుడిసెలు కనిపించకుండా గోడలు నిర్మించడాన్ని కూడా సేన తప్పుపట్టింది. నాటి ఇందిరా గాంధీ 'గరీభీ హఠావో' నినాదాన్ని ప్రస్తావిస్తూ... నేటి నరేంద్ర మోదీ సర్కారు తాజాగా 'గరీబీ చుపావో (పేదరికాన్ని దాచేయండి)' అనే పథకాన్ని మొదలుపెట్టారని శివసేన ఎద్దేవా చేసింది.

slave mentality of Indians: Shiv Sena slams bjp on trump visit

హ్యూస్టన్ లో 'హౌడీ మోదీ' తరహాలో అహ్మదాబాద్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, భారత ప్రధాని మోదీ పాల్గొనబోయే సభకు మొదట 'కెమ్‌ ఛో ట్రంప్‌' అని గుజరాతీ పేరు పెట్టారు. దీనిపై గందరగోళం ఏర్పడటంతో కార్యక్రమం పేరును 'నమస్తే ట్రంప్'గా మార్చినట్లు గుజరాత్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

English summary
Shiv Sena attack on former ally BJP on Monday said that the ongoing preparations for US President Donald Trump's visit reflect the 'slave mentality' of Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X