వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ,రాహుల్ దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి లక్నోకి 163 కి.మీ దూరంలోని చిబ్రమౌ సమీపంలోని జీటీ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

జైపూర్ నుండి ఫరూఖాబాద్ వెళ్తున్న ఆ బస్సులో ప్రమాద సమయంలో సిబ్బందితో సహా మొత్తం 45 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మంటల్లో కాలిపోయిన 10 మృతదేహాలను ఫోరెన్సిక్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయని, మిగతా మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు. గాయపడ్డ 21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడినట్టు వెల్లడించారు.

Sleeper bus goes up in flames, 20 passengers burnt alive

బస్సు ట్రక్కును ఢీకొట్టిన తర్వాత డీజిల్ ట్యాంకులో పేలుడు సంభవించడంతో బస్సులో మంటలు చెలరేగినట్టు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉండవచ్చునని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదంలో చనిపోయినవారికి సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ ద్వారా మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు. కాగా,ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

English summary
At least 20 people died in uttar pradesh bus tragedy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X