బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనింగ్ కింగ్ గాలి ప్రత్యేక విమానంలో పరుగో పరుగు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఘనంగా చేశారని వచ్చిన ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు గాలి ఇంట్లో, ఆయన కార్యాలయాల్లో అధికారులు సోదాలు చెయ్యడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందారు. ఎందుకు గాలి జనార్దన్ రెడ్డి విషయంలో అధికార పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారు అని ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తన ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్ణాటకలోని జిందాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బళ్లారి చేరుకున్నారు.

అక్కడ తన కుమార్త పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు, పనులు పూర్తి చేసుకున్న తరువాత గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో ఉండటానికి ఇంక అవకాశం లేదు. అందుకే ఆయన అన్ని వివరాలు తెలుసుకుని బెంగళూరు బయలుదేరారు.

Sleuths from Income tax department raided AMC and OMC offices belonging to Janardhana Reddy on Monday.


గాలి మీద పలువురు చేసిన ఆరోపణలు, మీడియాలో వచ్చిన వార్తలు ఇవే !

రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చేశారని ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీ శాఖ సెక్షన్ 133(ఎ) ప్రకారం అధికారులు విచారణ మొదలు పెట్టారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లికి భారీ సెట్టింగ్స్ వేయించారని ఆరోపణలు ఉన్నాయి.

గాలి తన కుమార్తె బ్రహ్మిణి రూ. 90 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన వజ్రాలు, బంగారు నగలు వేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రోజులో గాలి బళ్లారీ నుంచి వెళ్లిపోవాల్సిన సమయంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు.

అదే విధంగా గాలి జనార్దన్ రెడ్డి ఖరీదైన వస్త్రాలు, బహుమతులు ఇవ్వడానికి రూ. 100 కోట్లు, భోజనాల ఖర్చుకు రూ. 20 కోట్లు, పెళ్లికి వచ్చిన అతిథులు బస చెయ్యడానికి స్టార్ హోటల్స్ లో 1,500 గదులు బుక్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్యాలెస్ గ్రౌండ్స్ లో కళ్యాణ పండపం దగ్గర రూ. ఒక కోటి ఖర్చు పెట్టి విజయ విఠల ఆలయం సెట్టింగ్ వేయించారని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు రూ. 10 కోట్లు ఇచ్చారని, పెళ్లిలో భద్రత కల్పించడానికి బౌన్సర్లకు రూ. 30 లక్షలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి

English summary
Just days after his daughter's lavish wedding, Income Tax officials raided mining baron Gali Janardhana Reddy's offices in Ballari. Sleuths from Income tax department raided AMC and OMC offices belonging to Janardhana Reddy on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X