వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్లిప్పర్ విసిరిన దుండగుడు: తేజస్వి ఒడిలో పడిన పాదరక్ష.. నో కామెంట్..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. ఔరంగబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం తేజస్వి వచ్చారు. ప్రసంగానికి ముందు ఆయన స్టేజీ మీద కూర్చొన్నారు. శానిటైజర్ రాసుకొని.. అందరినీ జరగాలని కోరారు. అంతలోనే అతనిపై పాదరక్ష పడింది.

గుర్తుతెలియని వ్యక్తి రెండు చెప్పులు విసిరేశారు. అవీ సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఒక చెప్పు వెనకకు వెళ్లగా..మరోటి మాత్రం తేజస్వి మీద పడింది. దీంతో ఆర్జేడీ నేతలు నినాదాలు చేశారు. అయితే ఎవరు చెప్పు వేశారనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. తర్వాత బహిరంగ సభ వేదికపై నుంచి తేజస్వి యాదవ్ ప్రసంగించారు. కానీ తనపై స్లిప్పర్‌తో దాడి విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

Slippers Thrown At RJDs Tejashwi Yadav At Bihar Poll Rally

బీహర్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ లక్ష్యంగా తేజస్వి యాదవ్ విమర్శలు చేస్తున్నారు. బీహర్‌కి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. గత 15 ఏళ్ల నుంచి ప్రజలు ఎదురుచూసి ఓపిక నశించిందని తెలిపారు. దీంతో పేదరికంలోనే మగ్గుతున్నారనిత పేర్కొన్నారు. నిరుద్యోగితతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ద్వంద్వ వైఖరి గల ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగి వేశారుతున్నారని తెలిపారు.

బీహర్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా.. ఆర్జేడీ 144 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్, లెప్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్.. జేడీయూకు వ్యతిరేకంగా చాలా చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపారు. జేడీయూ, బీజేపీ కూటమి కలిసి బరిలోకి దిగింది.

English summary
Tejashwi Yadav, the Leader of Opposition in Bihar, was on Tuesday attacked with slippers while campaigning for his party RJD's candidate in Aurangabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X