వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమల్‌హసన్‌పై చెప్పు విసిరిన దుండగుడు

|
Google Oneindia TeluguNews

చెన్నై : తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్‌ హసన్‌హై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లుపురంలో నిర్వహించిన రోడ్ షో లో ఈ ఘటన జరిగింది. అయితే అది కమల్ హసన్‌కు తగలలేదు. మరికొంత మంది కూడా కమల్‌పై చెప్పులు విసిరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెప్పు విసిరిన వ్యక్తితో పాటు దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వతంత్ర తొలి ఉగ్రవాది... వ్యాఖ్యలు చేసిన కమలహాసన్ పై క్రిమినల్ కేసుస్వతంత్ర తొలి ఉగ్రవాది... వ్యాఖ్యలు చేసిన కమలహాసన్ పై క్రిమినల్ కేసు

దాడికి ప్రయత్నించిన వారిలో బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమాన్ సేన సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిందువే తొలి ఉగ్రవాదన్న కమల్ వ్యాఖ్యలకు నిరసనగానే వారు చెప్పులతో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Slippers were thrown at actor-turned-politician Kamal Haasan

హిందూ ఉగ్రవాది అంటూ రెండ్రోజుల క్రితం కమల్ హసన్ చేసిన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. స్వతంత్ర భారతావనిలో మొట్ట మొదటి ఉగ్రవాది హిందువని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. కమల్ చేసిన కామెంట్లు పెను దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల నిరసనల ప్రదర్శనలు నిర్వహించిన ఆందోళనకారులు కమల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమల్ వ్యాఖ్యలపై తమిళనాడు కరూర్ జిల్లాలకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కేసు నమోదుచేశారు. హిందువులను టెర్రిరిస్టులంటూ కమల్ హసన్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు 15ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

English summary
Slippers were thrown at actor-turned-politician Kamal Haasan on Wednesday evening when he was campaigning in Tirupparankundram assembly constituency in Madurai. The slipper attack came three days after Mr Haasan had said that independent India's first extremist was a Hindu, referring to Mahatama Gandhi's assassin Nathuram Godse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X