వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేలో షాకింగ్ విషయాలు : మహిళలపై లైంగిక వేధింపులకు అదే కారణమట.!

|
Google Oneindia TeluguNews

ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూసీ బ్రౌజర్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 21వ శతాబ్దపు ఆధునిక ప్రపంచంలో ఉన్నప్పటికీ.. మహిళల పట్ల ఇప్పటికీ చాలామంది ఆలోచనా ధోరణిలో పెద్ద మార్పేమీ లేదని వెల్లడైంది.

సర్వేలో భాగంగా.. లైంగిక వేధింపులకు మహిళలు ధరిస్తున్న కురచ దుస్తులే కారణం అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు 70శాతం మంది 'అవును' అని సమాధానం ఇచ్చారు. మొత్తం 38,236 మంది యూసీ యూజర్స్ ఈ ప్రశ్నపై స్పందించగా.. అందులో 26,771 మంది అవును అని,మిగతావాళ్లు కాదు అని సమాధానం ఇచ్చారు.

small clothes are the reason for sexual abuse shocking facts revealed in uc suvey

మరో ప్రశ్నకు సమాధానంగా.. 63% మంది ప్రజలు తమ ఇళ్లలో పురుషులు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ప్రశ్నపై మొత్తం 30627 మంది స్పందించగా.. అందులో 19,196 మంది అవును అని,మిగతావారు కాదు అని సమాధానం ఇచ్చారు. ఇక మహిళల సానిటరీ ప్యాడ్స్ కొనేందుకు పురుషులు ఇబ్బందిగా ఫీల్ అవుతారా అన్న ప్రశ్నకు.. 70శాతం మంది అలాంటిదేమీ లేదని చెప్పారు. సానిటరీ ప్యాడ్స్ కొనేందుకు పురుషులు పెద్దగా సంకోచించరని తెలిపారు.

ఈ ప్రశ్నకు మొత్తం 27056 మంది యూజర్స్ స్పందించగా.. సానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేసేందుకు తామేమీ ఇబ్బందిగా ఫీల్ అవమని 18,621 మంది చెప్పారు. మొత్తం 10 భాషల్లో మార్చి మొదటివారంలో ఈ సర్వేను నిర్వహించారు. 95,946 మంది డిజిటల్ యూజర్స్ సర్వేలో పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు వారి నుంచి ఆసక్తికర సమాధానాలు వ్యక్తమయ్యాయి.

English summary
On the occasion of Women's Day, an online survey has been conducted by UC Browser all over India. The results of this survey are shocking. Yes! Even in the 21st century, there has not been much change in people's thinking. The UC asked whether the short dresses are the reason for sexual offenses against women. In response to this, 70% percent of the participants said yes, small clothes are the reason for sexual harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X