వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పీపీఎఫ్, కేవీపీ వడ్డీరేట్లపై కోత విధించిన కేంద్రం

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ,నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస్ పత్రాల వడ్డీరేట్లను కేంద్రం తగ్గించింది.మూడు నెలలకు ఓ సారి మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీరేట్లను సమీక్షించనుంది కేంద్రం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస పత్ర వడ్డీరేట్లపై మరోసారి ప్రభుత్వం కోత పెట్టింది. పీపీఎఫ్, కేవీపీ, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం, సుకన్యా సమృద్ధి యోజన సహ పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై 10 బేసిస్ పాయింట్లను తగ్గించినట్టు కేంద్రం ప్రకటించింది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం, సకన్యా సమృద్ది యోజన సహ పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. తాజా నిర్ణయం ప్రకారంగా పీపీఎఫ్, ఎన్ఎస్ సీ పథకాలపై 7.8 శాతం, కేవీపీ పై 7.5 శాతంగా ఉండనుంది, సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్య సమృద్ది పథకాలపై 8.3 శాతం వడ్డీరేట్లు వర్తించనుంది. ఇప్పటివరకు ఇది 8.4 శాతంగా ఉంది.

Small saving schemes: PPF, NSC rates cut to 7.8 per cent, KVPs to earn 7.5 per cent

మూడు నెలలకోసారి మార్కెట్ రేటకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఈ వడ్డీరేట్లకు ప్రాతిపదికగా అంతకు ముందు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకొంటారు.

ఆర్థికాభివృద్దికి దోహదపడేలా వ్యవస్థను తక్కువస్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్నా కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకొంది. గత మార్చి నెల సమీక్షంలో కూడ 10 బేసిస్ పాయింట్లను తగ్గించింది కేంద్రం.

English summary
Centre on Friday cut interest rates on small saving schemes, including, NSCs, Public Provident Fund (PPF) and Kisan Vikas Patra by 10 basis points. The revised PPF and NSCs are set at 7.8%, while KVPs will earn only 7.5%. The new rates for Senior Citizen’s Savings Scheme (SCSS) and Sukanya Samriddhi Yojana have been revised to 8.3%, Economic Times reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X