వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎంసిలో అవినీతి, ఫైళ్ళు కదలవు, పనులు జరగవంటూ స్మితా ఠాక్రే సంచలనం

బీఎంసి ఎన్నికలు జరిగే సమయంలో జైదేవ్ ఠాక్రే మాజీసతీమణి స్మితా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎంసి లో అవినీతిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. షైళ్లు కదలవు, రోడ్లు సరిగా లేవంటూ ఆమె మండిపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:ముంబై మున్సిఫల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో జైదేవ్ ఠాక్రే మాజీ సతీమణి స్మితా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎంసిలో అవినీతి గురించి తీవ్రంగా మండిపడ్డారు.

గత కొన్నేళ్ళుగా బీఎంసిలో బిజెపి..శివసేన సంకీర్ణ పాలన సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో శివసేన, బిజెపి వేర్వేరుగా పోటీచేస్తున్నాయి. శివసేన , నవనిర్మాణసేన కలిసి పోటీచేస్తున్నాయి.

Smita Thackeray slams BMC for corruption, leaves Shiv Sena embarrassed

అయితే ఈ సమయంలోనే ఠాక్రే కోడలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలా ఠాక్రే నుండి విడిపోయిన కొడుకు జైదేవ్ ఠాక్రే మాజీ భార్య అయిన స్మితా ఠాక్రే బీఎంసిలో అవినీతి గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు.2004లో జైదేవ్ నుండి ఆమె విడాకులు తీసుకొన్నారు.

ముంబై రోడ్లన్నీ గుంతలతో నిండిపోయాయి. బీఎంసీలో అవినీతి ఎప్పటికీ పరిష్కారం కాకుండానే ఉండిపోయింది. విడాకులు తీసుకొనే వరకు ఆమె ఠాక్రే స్వంత ఇల్లైన 'మాతోశ్రీ'లోనే ఉండేవారు.

బీఎంసీలో పనులు ఏ మాత్రం జరగవని, ఫైళ్ళు కదలవని స్మితా ఠాక్రే విమర్శించారు. తాను ఠాక్రే కుటుంబం నుండి వచ్చిన మహిళను అయినా తాను కూడ అనేక సమస్యలను ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.

చాలా కాలం నుండి ఓట్లు వేస్తున్న వారికి ఈ దఫా ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మహరాష్ట్ర నవనిర్మాణ్ సమితి పలు కీలకమైన అంశాలను లేవనెత్తుతోందని ఈ సారి ఎన్నికల్లో వాళ్ళకు తగినన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని స్మితా ఠాక్రే అభిప్రాయపడ్డారు.

English summary
In a major embarrassment for the Shiv Sena on the polling day, Thackeray bahu has slammed the way the Brihanmumbai Municipal Corporation (BMC) works. Smita Thackeray, ex-wife of Jaidev Thackeray--Balasaheb's estranged son, said corruption continues to be the mainstay of BMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X