వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దల సభలో పొగలు.. రాజ్యసభ వాయిదా.. అందరూ సేఫ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

విద్యుదాఘాతానికి గురైన బీజేపీ ఎంపీ ! || Smoke Form Mike In Rajya Sabha || Oneindia Telugu

న్యూఢిల్లీ : రాజ్యసభలో హఠాత్ పరిమాణం జరిగింది. బెంచ్ వద్ద ఉండే మైక్ నుంచి ఒక్కసారిగా పొగ వచ్చింది. దీంతో ఖంగుతిన్న సభ్యుడు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో సభను వాయిదా వేశారు. వెంటనే సిబ్బందిని పిలిపి మరమ్మతు చేయాలని ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే పొగ వచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత సరిచేయడంతో ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దల సభ రాజ్యసభలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. బెంచ్ వద్ద ఉండే మైక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో బీజేపీ ఎంపీ కేజే అల్పోన్స్ లేచి మరో సీట్లు కూర్చొన్నారు. వెంటనే విషయాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు సమాచారం అందించారు. దీంతో సభను ఆయన వాయిదా వేశారు. సిబ్బందిని పిలిచి మైక్ సరిచేయాలని ఆదేశించారు. అయితే షార్ట్ సర్కూట్ వల్ల మైక్ నుంచి పొగలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆల్పోన్స్‌కు విద్యుత్ షాక్ తగలినట్టు సమాచారం. దీనిని ఆ సభ్యుడు ధ్రువీకరించాల్సి ఉంది.

smoke doused at rajya sabha

ఇవాళ ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత చర్చ ప్రారంభిద్దామనుకునే సమయానికి పొగ వచ్చింది. నాలుగో వరసలో కూర్చొన్న అల్పోన్స్ మైక్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు.

English summary
smoke doused at rajya sabha. bjp mp alphones notice smoke and tell to chairman venakaiah naidu. he urged the rajya sbha 15 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X