వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వే

|
Google Oneindia TeluguNews

ధూమపానం చేసేవారు మరియు శాఖాహారులు తక్కువగా సెరో పాజిటివిటీ కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. వారు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుందని దాదాపు 40 సంస్థలలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నిర్వహించిన పాన్-ఇండియా సెరోసర్వే లో తేలింది. బ్లడ్ గ్రూప్ 'ఓ' ఉన్నవారు ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం తక్కువని, 'బి', 'ఎబి' బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని సర్వేలో తేలింది.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారికరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి

సిఎస్ఐఆర్ లో పని చేసే 10,427 మందిపై అధ్యయనం ..1,058 మందికి యాంటీ బాడీస్

సిఎస్ఐఆర్ లో పని చేసే 10,427 మందిపై అధ్యయనం ..1,058 మందికి యాంటీ బాడీస్

అధ్యయనం కోసం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) తన ప్రయోగశాలలు లేదా సంస్థలలో పనిచేస్తున్న 10,427 మంది వ్యక్తుల నమూనాలను మరియు వారి కుటుంబ సభ్యుల నమూనాలను స్వచ్ఛంద భాగస్వామ్యం ఆధారంగా తీసుకుంది . కరోనా వైరస్ కు యాంటీ బాడీస్ ఉనికిని అంచనా వేయడానికి తీసుకుని సర్వే నిర్వహించింది . ఢిల్లీలోని సిఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) చేసిన ఈ అధ్యయనంలో 10,427 మంది వ్యక్తులలో 1,058 (10.14 శాతం) మందికి కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ఉన్నాయని చెప్పారు.

మూడు నెలల తర్వాత అధ్యయనంలోనూ యాంటీ బాడీస్ వృద్ధి

మూడు నెలల తర్వాత అధ్యయనంలోనూ యాంటీ బాడీస్ వృద్ధి

మూడు నెలల తరువాత వారి నమూనాలలో 346 సెరోపోజిటివ్ వ్యక్తులపై ఫాలో అప్ చెయ్యగా కరోనా వైరస్ కు వ్యతిరేకంగా స్థిరమైన 'అధిక' యాంటీబాడీ స్థాయిలను వెల్లడించింది.
ఆరునెలల వద్ద 35 మంది వ్యక్తుల పునరావృత నమూనాలో యాంటీబాడీ స్థాయిలు తగ్గుతున్నాయని వెల్లడించింది. తటస్థీకరించే యాంటీబాడీస్ మూడు నెలలతో పోలిస్తే స్థిరంగా ఉంది. అయినప్పటికీ, సాధారణ యాంటీబాడీ మరియు తటస్థీకరించే యాంటీబాడీ రెండూ అవసరమైన పరిమితికి మించి ఉన్నాయని తేలింది .

ధూమపానం చేసేవారికి కరోనా పాజిటివ్ వచ్చే ఛాన్స్ తక్కువే

ధూమపానం చేసేవారికి కరోనా పాజిటివ్ వచ్చే ఛాన్స్ తక్కువే

ధూమపానం చేసేవారు సెరోపోజిటివ్ అయ్యే అవకాశం తక్కువగా ఉందని , కరోనా శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ, ధూమపానం రక్షణగా ఉంటుందని ఆధారాలు పెరుగుతున్నాయని అధ్యయనం తెలిపింది. ఫ్రాన్స్ నుండి రెండు అధ్యయనాలు మరియు ఇటలీ, న్యూయార్క్ మరియు చైనా నుండి ఇలాంటి నివేదికలను ఉదహరించింది. ఇది ధూమపానం చేసేవారిలో సంక్రమణ రేటు తక్కువగా ఉందని నివేదించింది.జనాభా సమాచారంతో పాటు, బ్లడ్ గ్రూపు , వృత్తి రకం, ధూమపానం మరియు మద్యంతో సహా అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు, వైద్య చరిత్ర మొదలైన డేటాతో ప్రమాద కారకాలను విశ్లేషించారు.

కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం వీరికే ఎక్కువ అని గతంలో అధ్యయనాలు

కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం వీరికే ఎక్కువ అని గతంలో అధ్యయనాలు

ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నవారికి , భద్రతకు సంబంధించిన వారికి , ఇంటిని నిర్వహించే వారికి , ధూమపానం చేయనివారిలోనూ , మాంసాహారులు, వృత్తిపరమైన బాధ్యతలు ఉన్న వారిలో అధిక సెరోపాజిటివిటీ కనుగొనబడిందని అధ్యయనం కనుగొందని సెన్‌గుప్తా చెప్పారు. ధూమపానం చేసేవారు కోవిడ్ -19 కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని గత ఏడాది జూలైలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది . పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు.

ఏ 'లేదా ఓ' బ్లడ్ గ్రూప్స్ వారికి ధూమపానం చేసినా కరోనా సోకే అవకాశం తక్కువ

ఏ 'లేదా ఓ' బ్లడ్ గ్రూప్స్ వారికి ధూమపానం చేసినా కరోనా సోకే అవకాశం తక్కువ

కోవిడ్ -19 పాండమిక్ అండ్ టొబాకో యూజ్ ఇన్ ఇండియా' అనే పరిశోధనా పత్రంలో, ధూమపానం చేసేవారు తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని , కరోనా సోకితే చనిపోయే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారని, ఎందుకంటే ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని , అందుకు ఊపిరితిత్తులకు హాని కలిగించే ఉత్పత్తులు వాడకుండా ఉంటే మంచిదని చెప్పారు . అయితే ఏ 'లేదా ఓ' బ్లడ్ గ్రూప్స్ వారికి ధూమపానం చేసినా కరోనా సోకే అవకాశం తక్కువగా ఉన్నట్టు తేలింది .

యాంటీబాడీస్ యొక్క ప్రాబల్యం మరియు వ్యవధిపై సర్వేలో ఆసక్తికర ఫలితాలు

యాంటీబాడీస్ యొక్క ప్రాబల్యం మరియు వ్యవధిపై సర్వేలో ఆసక్తికర ఫలితాలు

అయితే ప్రైవేట్ రవాణా, తక్కువ-ఎక్స్పోజర్ వృత్తులు, ధూమపానం, శాఖాహారం మరియు ఎ 'లేదా ఓ' బ్లడ్ గ్రూప్స్ వారికి రక్షణగా కనిపించింది . ఇలాంటి సమిష్టి సర్వే ఇదే మొదటిదని ఆయన అన్నారు. యాంటీబాడీస్ యొక్క ప్రాబల్యం మరియు వ్యవధిని అర్థం చేసుకోవడానికి యాంటీ బాడీస్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. సిఎస్ఐఆర్ దేశంలో 40 సంస్థలను కలిగి ఉంది . సిఎస్ఐఆర్ లో ప్రతి ఒక్కటి వివిధ రంగాలలో ప్రత్యేకత కలిగి ఉంది. కరోనావైరస్ యొక్క జన్యు శ్రేణిని నిర్వహించడంలో ఐజీఐబీ మరియు దాని కో ఇన్స్టిట్యూట్ సెంటర్ ఆఫ్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ముందంజలో ఉన్నాయి .

English summary
Smokers and vegetarians were found to have lower seropositivity indicating that they may be at a lesser risk of getting infected by coronavirus, according to a pan-India serosurvey conducted by the Council of Scientific and Industrial Research in its nearly 40 institutes. The survey also found that those with blood group ‘O’ may be less susceptible to the infection, while people with ‘B’ and ‘AB’ blood groups were at a higher risk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X