వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Smoking Kali: సిగరెట్‌తో కాళిక అమ్మవారి పోస్టర్: ఎల్జీబీటీక్యూ జెండా కూడా

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ లీనా మ‌ణిమేఖలై వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఆమె తాజాగా రూపొందిస్తోన్న ఓ డాక్యుమెంట‌రీ ఫిల్మ్. కాళీ పేరుతో ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. ఇదొక పెర్ఫార్మెన్స్ డాక్యుమెంటరీ. ఆశా పొన్నచాన్ అసోసియేట్ ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తోన్నారు. ఈ డాక్యుమెంటరీకి శ్రావణ్ కో రైటర్.

ఈ డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్‌ను మణిమేఖలై విడుదల చేశారు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారిందీ పోస్టర్. దీనికి కారణం- కాళిక అమ్మవారు సిగరెట్ తాగుతున్నట్టు డిజైన్ చేయడమే. కాళిక అమ్మవారి పాత్రను పోషించిన నటి పొగ తాగుతున్నట్లు కనిపించారిందులో. ఓ చేత్తో త్రిశూలం, మరో చేత్తో స్వలింగ సంపర్కుల సమాజానికి గుర్తుగా ఉపయోగించే జెండాను పట్టుకున్నారు.

ఈ పోస్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ అయిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ఫిల్మ్ మేకర్ మణిమేఖలై ఆటలాడుతున్నారంటూ మండిపడుతున్నారు ట్విట్టరెటీలు. ఆమెను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ట్విట్టర్లో #ArrestLeenaManimekalai అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మణిమేఖలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షాలకు వాటిని ట్యాగ్ చేస్తోన్నారు.

 Smoking Kali: Leena Manimekalai has courted controversy after she tweeted a poster

లీనాపై గో మహాసభ చీఫ్ అజయ్ గౌతమ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ ఫిర్యాదు పత్రాన్ని పంపించారు. లీనాపై వెంటనే ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాళి పేరుతో రూపుదిద్దుకుంటోన్న డాక్యుమెంటరీ వెంటనే నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంపై మణిమేఖలై స్పందించారు. తాను భయపడట్లేదని పేర్కొన్నారు.

తాను చెప్పదలచుకున్నదేమిటో.. ఈ డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ఎలాంటి భయం లేకుండా తన గళాన్ని తాను ఈ డాక్యుమెంటరీ ద్వారా వినిపించదలచుకున్నానని పేర్కొన్నారు. లీనా మణిమేకలై ఇదివరకు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అనంతరం డాక్యుమెంటరీ మేకర్‌గా స్థిరపడ్డారు. మహాత్మా పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

English summary
Film-maker Leena Manimekalai has courted controversy after she tweeted a poster of her recent documentary in which the Goddess Kali is shown smoking
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X