వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..

|
Google Oneindia TeluguNews

అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‍‌లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకుగానూ తాను అమేథీలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాట్లు ప్రకటించారు. ఇందుకోసం గౌరీ గంజ్‌లో ఇప్పటికే ఫ్లాట్ కూడా చూసినట్లు చెప్పారు.

స్మృతి ఇరానీ కూతురు ఫోటోపై కామెంట్స్ ! డిలీట్ చేసి, ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్!స్మృతి ఇరానీ కూతురు ఫోటోపై కామెంట్స్ ! డిలీట్ చేసి, ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్!

Recommended Video

ఆ నలుగురు ఎంపీలవి పార్టీ ఫిరాయింపులే.. -కళా వెంకట్ రావు

శనివారం అమేథీ పర్యటనలో భాంగా ఆమె వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసిరూ. 30కోట్ల విలువైన రోడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల తాళాలు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సొంత నియోజకవర్గంలో ఇంటిని కట్టుకోనున్నారన్న విషయాన్ని ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే స్మృతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Smriti Irani Does What Rahul Did Not for 15 Years

15ఏళ్ల పాటు అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ కనీసం అక్కడ ఇల్లు కట్టుకోకపోవడాన్ని స్మృతి తప్పుబట్టారు. అయితే తాను అలా చేయనని, తనను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, వారి కోసం తన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు దాదాపు 4లక్షల మంది ఓటేశారన్న స్మృతి వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని చెప్పారు. ఉజ్వల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలు రాహుల్‌కు ఓటేసిన వారికి కూడా వర్తింపజేస్తామని అన్నారు.

2004 నుంచి రాహుల్ గాంధీ అమేథీ నియోజక వర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు 1999లో ఆయన తల్లి సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ సోనియాగానీ, రాహుల్ గాంధీ గానీ అమేథీ నియోజకవర్గ పరిథిలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోలేదు. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు వారు గెస్ట్ హౌస్‌లోనే బస చేసేవారు.

English summary
At her first visit after an emphatic victory in Amethi, Union Minister for Women and Child Development Smriti Irani announced that she will construct her own house in her constituency. She has already identified a plot in Gauriganj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X