వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మంత్రివర్గంలో స్మృతి ఇరానిదే అతి పిన్న వయస్సు...!

|
Google Oneindia TeluguNews

రెండవసారీ పదవి భాద్యతలు చేపట్టిన మోడీ క్యాబినెట్‌లలో అతి పిన్నవయస్సు కల్గిన మంత్రిగా స్మృతి ఇరాని చోటు సంపాదించుకుంది.స్మృతి ఇరానికి 43 సంవత్సరాల వయస్సులో కేబినెట్‌లో చోటు సంపాదించుకోగా.. ఆమేతో పాటు మరో నలుగురు యువ మంత్రులుగా ఉన్నారు. వారిలో అనురాగ్ సింగ్ ఠాకూర్ 44, మన్‌సుక్ మాండవీయా మరియు కుమార్ బాలాయాన్ 46, కిరణ్ రిజుజు 47, సంవత్సారాల వయస్సులో మంత్రి పదవి దక్కించున్నారు. కాగా మొదటిసారి మంత్రి పదవి దక్కిన రామేశ్వర్ తెలీ, దెబశ్రీ చౌదరీలు కూడ 48 సంవత్సారాలు వయస్సు కల్గి ఉన్నారు.

కాగా మొత్తం క్యాబినెట్‌ మంత్రుల్లో అతి ఎక్కువ వయస్సు కల్గిన మంత్రిగా బీజేపీ మిత్రపక్షమైన లోక్‌జనశక్తి అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌కు 73 సంవత్సరాలు. ఇక రాంవిలాస్ పాశ్వాన్‌ అనంతరం, 71 సంవత్సరాల వయస్సుతో తవార్ చంద్ గెహ్లాట్, సంతోష్ గంగ్వార్‌‌ల ఉన్నారు. గత క్యాబినెట్ మంత్రుల వయస్సుతో పోల్చితే ఈ సారీ మంత్రి పదవులు చేపట్టిన వారి సరాసరి వయస్సు తగ్గింది. గతంలో మంత్రుల సరాసరి వయస్సు 65 సంవత్సరాలు ఉండగా, రెండవ సారీ చేపట్టిన క్యాబినెట్ మంత్రుల సరాసరి వయస్సు 62 సంవత్సరాలుగా ఉంది.

Smriti Irani emerged as the youngest in the MOdis government

మరోవైపు సీనియర్ మంత్రులైన అరుణ్ జైట్లీ 66,సుష్మా స్వరాజ్‌లు 67లు ఆనారోగ్య కారణాలతో తిరిగి మంత్రి పదవులు చేపట్టలేదు. ఇక రెండవ సారి గెలిచిన కొద్దిమంది సీనియర్ మంత్రులను కూడ మోడీ పక్కన పెట్టాడు.వీరిలో ఆరుసార్లు ఎంపీగా గెలిచిన రాధమోహన్ సింగ్ ,టూరిజం మంత్రిగా చేసిన ఆల్ఫోన్స్ కన్ననాథమ్‌లతో పాటు మరికొందరకి కూడ రెండవసారి చేపట్టిన క్యాబినెట్‌లో స్థానం లభించలేదు.

English summary
Smriti Irani at 43 years of age has emerged as the youngest in the second Narendra Modi government's council of ministers, who with an average age of 60 years, are a shade younger than their predecessors, who had an average of 62 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X