స్మృతి ఇరానీ కూతురు ఫోటోపై కామెంట్స్ ! డిలీట్ చేసి, ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్!
న్యూఢిల్లీ : ఆకతాయిల అల్లరి మధ్యతరగతి విద్యార్థినులకే కాదు .. సెలబ్రిటీ పిల్లలను కూడా వదలడం లేదు. వారిని ఎడిపించే సమయంలో తమను ఏమైనా చేస్తారనే భయం, వణుకు లేకపోవడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురును ఏడిపించాడు ఆకతాయి.
జోయిష్‌కు ర్యాగింగ్ ..

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయష్ ఇరానీని తన క్లాస్మెంట్ ఏడిపించాడు. ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్లో తల్లితోపాటు జోయిస్ ఫోటో దిగారు. ఈ ఫోటోను స్మృతి ఇరానీ ఇన్ స్ట్రాగ్రామ్లో షేర్ చేశారు. దీనిని జోయిస్ క్లాస్ మెట్ చూసి .. ఎగతాళిగా నవ్వాడట. అంతేకాదు తమ తరగతి గదిలో ఫోటోను చూపిస్తూ .. జోయిస్ ఎలా ఉందో చూడాలని అందరికీ చూపించడట. దీంతో నొచ్చుకున్న జోయిష్ ఇంటికొచ్చి .. జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పింది. అయితే వెంటనే ఇన్ స్ట్రాగ్రామ్లో ఆ ఫోటోను స్మృతి తీసేశారు.

చేయొద్దు .. కానీ ...
వాస్తవానికి ఫోటో డిలేట్ చేయడం స్మృతికి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ కూతురు కంటతడి చూడలేక తప్పలేదు. అయితే ఆ ఆకతాయికి తగినరీతిలో సమాధానం చెప్పారు కేంద్రమంత్రి. జోయిష్ ఫోటో చూపించి ఓ ఇడియట్ ఆమెను ఎగతాళి చేశాడు. ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలని విద్యార్థులను కూడా రెచ్చగొట్టాడని .. అయితే తన కూతురు ఎవరికీ భయపడదని స్పష్టంచేశారు. ఫోటోను కేవలం తన కూతురు అడిగిందనే డిలేట్ చేశాను .. తప్ప .. భయపడి కాదని తేల్చిచెప్పారు.
జోయిష్ మంచి క్రీడాకారిణి, లిమ్కా బుక్స్‌లో కూడా చోటు సంపాదించారు. కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ సాధించిందని గుర్తుచేశారు. వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య పతకం కూడా గెలుచుకున్నారు. తన కూతురు అందంగా ఉండటంతోపాటు మంచిందని .. మీరు ఎంత ఎడిపించినా తిరిగి పోరాడగలదని స్పష్టంచేశారు. జోయిష్ ఇరానీ తల్లినైనందుకు గర్విస్తున్నానని స్మృతి పేర్కొన్నారు.