వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంకా గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్.. మాజీ ప్రధాని శాస్త్రిని ప్రియాంక అవమానించారట

|
Google Oneindia TeluguNews

యూపీలో గంగా యాత్ర ద్వారా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిజెపి నాయకులు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రియాంక గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె ఒక పొరపాటు చేశారని, మాజీ ప్రధానిని అవమానించారని బిజెపి నాయకులు ధ్వజమెత్తారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేస్తున్న వీడియో ని షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

 యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలా <br> యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలా

వివాదంలో ప్రియాంక .. శాస్త్రిని అవమానించారట

వివాదంలో ప్రియాంక .. శాస్త్రిని అవమానించారట

యూపీలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని భావించిన ప్రియాంకా గాంధీ గంగా యాత్ర చేస్తున్నారు. గంగా పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు . తాజాగా ఆమె చేసిన ఒక పని వివాదాస్పదం అవుతుంది.కావాలని చేశారని చెప్పలేం కానీ హడావుడితో ఆమె చేశారు అని బీజేపీ నేతలు చెప్తున్న పని ఇప్పుడుబీజేపీకి ఆయుధం అయ్యింది.తాజాగా ప్రియాంక గాంధీ చేసిన తప్పును భారీ ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

వీడియో షేర్ చేసి స్మృతీ ఇరాని ఫైర్ ..

వీడియో షేర్ చేసి స్మృతీ ఇరాని ఫైర్ ..

మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అవమానించారంటూ కొత్త ఆరోపణను తెర మీదకు తెచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
తాజాగా ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో తనకు వేసిన పూలమాలను ప్రియాంక లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసిన వైనాన్ని ప్రశ్నిస్తూ పెద్ద సినిమా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెఒక వ్యంగ్య కవితను సైతం పోస్ట్ చేశారు.

గంగా యాత్రలో ప్రియాంకకు చేదు అనుభవం .. శాస్త్రి విగ్రహ శుద్ధి చేసిన బీజేపీ

గంగా యాత్రలో ప్రియాంకకు చేదు అనుభవం .. శాస్త్రి విగ్రహ శుద్ధి చేసిన బీజేపీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రామ్ నగర్ లోని శాస్త్రి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
అక్కడ ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం లభించింది. ఆమె మెడలో పూల మాలలు వేశారు. తనకువేసిన ఒక పూలదండను చేత్తో పట్టుకున్న ఆమె.. లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసేశారనేది బిజెపి ఆరోపణ . అంతేకాదు మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి కి పూలమాలవేసి నివాళులర్పించడం శాస్త్రి విగ్రహానికి అవమానం చేసినట్టు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ మాజీ ప్రధానిని అవమానించారన్న ప్రచారాన్ని షురూ చేసిన బిజెపి నేతలుప్రియాంక వెళ్లిన కాసేపటికి అక్కడికి చేరుకున్న కమలనాథులు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు.

English summary
BJP workers "cleansed" the statue of former prime minister Lal Bahadur Shastri minutes after Congress general secretary Priyanka Gandhi Vadra garlanded it in Varanasi on Wednesday. According to sources, around a dozen saffron party workers "washed" the shasthri's statue with the water of river ganga .BJP leader Smriti Irani Wednesday accused Priyanka Gandhi Vadra of "insulting" Lal Bahadur Shastri as a purported video showed the Congress leader garlanding a bust of the former prime minister during her tour in Uttar Pradesh with the garland she had worn. Union minister Irani wrote a limerick in .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X