వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ హల్ చల్ .. మేరాఘర్ , హవాయ్ చెప్పులు .. లోకల్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులు

|
Google Oneindia TeluguNews

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు . ఏ విషయాన్ని చెప్పాలన్న తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునేలా చెప్పేసి స్మృతి ఇరానీ పెట్టే పోస్టులు కొన్ని ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని చాలా ఎమోషనల్ గా మనసు తాకుతాయి. ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై పోస్ట్ లు చేసే స్మృతీ ఇరానీ తాజాగా పెట్టిన పోస్ట్ లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

twitter recap 2020:ఈ ఏడాది ట్విట్టర్ ను ఊపేసిన అంశాలివే..టాప్ ట్రెండ్ లో ఉన్న జాబితా ఇదేtwitter recap 2020:ఈ ఏడాది ట్విట్టర్ ను ఊపేసిన అంశాలివే..టాప్ ట్రెండ్ లో ఉన్న జాబితా ఇదే

 స్మృతి ఇరానీ చెప్పులపై కామెంట్ .. నెటిజన్ కు సరదా రిప్లై

స్మృతి ఇరానీ చెప్పులపై కామెంట్ .. నెటిజన్ కు సరదా రిప్లై

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన భావాలను పోస్ట్ లుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆమె పెట్టిన ఫోటో పై ఆ నెటిజన్ కామెంట్ చేశారు. ముఖ్యంగా ఆమె చెప్పులపై కామెంట్ చేసిన నెటిజన్ కు స్మృతి ఇరానీ సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు. ఆ ఫోటో నా స్మృతి ఇరానీ తన ఇంటి గార్డెన్ లో లాప్టాప్ మీద వర్క్ చేసుకుంటూ కనిపిస్తున్నారు.

 అరే భాయ్ ..ఇవి హవాయి చెప్పులు , లోకల్ అంటూ సమాధానం

అరే భాయ్ ..ఇవి హవాయి చెప్పులు , లోకల్ అంటూ సమాధానం

నీలి రంగు దుస్తులు వేసుకుని , హవాయి చెప్పులు వేసుకుని స్మృతి ఇరానీ పని చేసుకుంటున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో చూసిన నెటిజన్ హవాయి చెప్పులు అంటూ కామెంట్ చేయగా, అరే భాయ్ ఇవి రెండు వందల రూపాయల విలువ చేసే హవాయి చెప్పులు , బ్రాండ్ మాత్రం అడగకు ఇది లోకల్ అంటూ ఫన్నీగా సమాధానమిచ్చారు . స్మృతి ఇరానీ చేసిన కామెంట్ చూసిన నెటిజన్స్ వోకల్ ఫర్ లోకల్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

"డోంట్ యాంగ్రీ మి లుక్" .. నాడు, నేడు ఫోటోలతో హావభావాలు

ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ చేసిన మరొక పోస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. "డోంట్ యాంగ్రీ మి లుక్" అని ఆమె ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో చిన్నప్పుడు కోపంగా ఉన్న స్మృతీ ఇరానీ, పెద్దయిన తర్వాత సేమ్ అదే ముఖకవళికల తో ఉన్న స్మృతి ఇరానీ రెండు ఫోటోలను కలిపి పోస్ట్ చేశారు. రూపం మారింది కానీ హావభావాలు మాత్రం మారలేదు అంటూ ఓ సీరియల్ పాట నుండి లైన్ తీసుకొని క్యాప్షన్ గా పెట్టారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ .

ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లు ఫిదా

ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లు ఫిదా

సహజంగానే నటనా రంగం నుండి వచ్చిన స్మృతి ఇరానీ హావభావాలను చూపించే ఆ ఫొటోకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో అత్యంత చురుకైన చట్టసభ సభ్యులలో ఒకరైన అమేథి ఎంపి , కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సుమారు రెండు గంటల్లో 33,000 మందికి పైగా లైక్ చేశారు. కరోనా సమయంలోనూ, స్మృతి ఇరానీకి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు, లాక్ డౌన్ సమయంలోనూ ఆమె చేసిన పోస్ట్ లు ఇన్ స్టాగ్రామ్ లో చాలా ప్రశంసించబడ్డాయి. ఇక మరొక ఎమోషనల్ పోస్టులో స్మృతి ఇరానీ ఆమె చిన్ననాటి ఇంటి గురించి, తన తాతతో ఉన్న జ్ఞాపకాలను గురించి , ఫోటోలను పెట్టి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

 మేరా ఘర్ అంటూ స్మృతి ఇరానీ ఎమోషనల్ ట్వీట్.. తాతతో జ్ఞాపకాలను పంచుకున్న కేంద్రమంత్రి

మేరా ఘర్ అంటూ స్మృతి ఇరానీ ఎమోషనల్ ట్వీట్.. తాతతో జ్ఞాపకాలను పంచుకున్న కేంద్రమంత్రి

మేరా ఘర్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన ఆమె ఆ పోస్ట్ ను తాతకు అంకితం చేశారు . ఆమెను ఆమె తాత దాదూ అని పిలిచేవారని పేర్కొంటూ అద్దె ఇళ్లలో నివసించిన వారికి ప్రతి 11 నెలలకు వేరే ప్రదేశానికి వెళ్లడానికి లగేజ్ ప్యాక్ చేయడం ఎలా అనిపిస్తుందో తెలుసు . పిల్లలు స్నేహితులను విడిచిపెట్టి, వారితో తీపి జ్ఞాపకాలు వదిలి వెళ్ళలేక చాలా సార్లు ఏడుస్తారు అంటూ పేర్కొన్నారు.1246 ఆర్.కె. పురం, న్యూ ఢిల్లీలో నా ఇల్లు మరియు ఇప్పటికీ నా హృదయం అక్కడ ఉంది ... ఎందుకంటే అక్కడ తన తాత జీవించారని ... నన్ను, నా జీవితాన్ని ఇలా మార్చిన తాత అంటూ పేర్కొన్నారు . తాతతో టెర్రస్ పాఠాల జ్ఞాపకాలు జీవిత పాఠాలుగా మారాయన్నారు . మీకు అలాంటి జ్ఞాపకాలు ఉంటే # మెరాఘర్‌తో ట్యాగ్ చేయండి "అని స్మృతి ఇరానీ రాశారు. ఇది చాలా మందికి మనసులను కదిలించిన ఎమోషనల్ పోస్ట్.

English summary
Union Minister Smriti Irani, known for engaging with her fans on social media, has once again posted an entertaining 'now and then' photo of her calling it "Don't Angry Me Look". In another post giving a glimpse into her childhood home and her favourite memories. The emotional post was dedicated mostly to her grandfather, whom she referred to as "Dadu", and the home in Delhi where he lived, where she spent her childhood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X