వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తి తిప్పిన స్మృతి ఇరానీ.. కేంద్రమంత్రి ఫీట్ వైరల్

|
Google Oneindia TeluguNews

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కత్తి తిప్పారు. గుజరాత్ సంప్రదాయక నృత్యం ''తల్వార్ రాస్'' ప్రదర్శించి ఆమె సందడి చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని భవనగర్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రెండు కత్తులను చేతబట్టి తల్వార్ రాస్ ప్రదర్శించడం అక్కడి వారందరిని ఆకట్టుకుంది .

గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాంప్రదాయ నృత్యం అయిన తల్వార్ రాస్ కు మంచి ఆదరణ ఉంది. ఇక కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆ సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించడంతో అందరూ ఆసక్తిగా తిలకించారు. శ్రీ స్వామి నారాయణ గురుకుల్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర జౌళి శాఖ, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అక్కడి చిన్నారులు ఇస్తున్న ప్రదర్శనను చూసి తాను సైతం వేదికపైకి వెళ్లి రెండు కత్తులు చేతబట్టి వారితో కలిసి నృత్యం చేసే ప్రయత్నం చేశారు.

Smriti Irani performed Talwar Raas.. central minister feat viral

అక్కడ ప్రదర్శన ఇచ్చే బాలికలతో కలిసి ఉత్తమం గానే స్మృతి ఇరానీ తల్వార్ రాస్ ప్రదర్శించారు. చిన్నారులను చూసి ఆమె కూడా కాసేపు అనుసరించారు. దీని తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్లమెంట్ వేదికగా తన గంభీరమైన కంఠాన్ని వినిపించి ప్రతిపక్ష పార్టీలకు నోటి మాట లేకుండా చేసినా , కత్తులు చేతబట్టి నృత్యం చేసినా ఆమెకు ఆమె సాటి అని ఆ వీడియో చూసిన వాళ్ళు స్మృతి ఇరానీ గురించి మాట్లాడుకుంటున్నారు.

English summary
Union Minister Smriti Irani performed 'Talwar Raas', a traditional dance form using swords, at a cultural programme in Bhavnagar . Irani, who could be seen wielding two swords on the stage, tried her best to match steps with the girls performing there.The Union Cabinet Minister for Textiles and Women and Child Development was in Bhavnagar for a cultural event hosted by the Shri Swaminarayan Gurukul.'Talwar Raas', is a traditional folk dance that is popular in Gujarat and Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X