వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీ ప్రశ్న:సస్పెన్షన్‌పై స్మృతి, ఖుష్బూ రజనీ ఉదాహరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సస్పెండ్‌కు గురైన అయిదుగురు అధికారుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం కోరారు. స్మృతి విద్యార్హత విషయంలో వివాదాస్పదం నెలకొన్న నేపథ్యంలో విశ్వవిద్యాలయం నుండి ఆమె విద్యార్హత పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలతో యూనివర్సిటీ నుండి అయిదుగురు అధికారులను శుక్రవారం సస్పెండ్ చేశారు.

దీనిపై స్మృతి ఇరానీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్మృతి వ్యక్తిగతంగా ఆ యూనివర్సిటీ వీసీని ట్విట్టర్లో కోరారు.

Smriti Irani requests Delhi University to reinstate suspended officials

దిగ్విజయ్ ప్రశ్న

స్మృతి విద్యార్హత లీక్ చేశారనే ఆరోపణల పైన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసిన ఘటనపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో స్పందించారు. మోడీ ప్రభుత్వానికి పారదర్శకత పైన విశ్వాసం లేదని ఆయన ట్వీట్ చేశారు.

వారు గ్రాడ్యుయేట్లు కాదు: ఖుష్బూ

దక్షిణాది నటి ఖుష్బూ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. డిగ్రీ కూడా లేని స్మృతి ఇరానీకి కీలకమైన మానవవనరుల శాఖ కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించడంపై ఆమె స్పందిస్తూ... సాధించడానికి ప్రతిభ ముఖ్యంగాని, విద్యార్హతలు కాదన్నారు. సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, రజనీకాంత్, బిల్ గేట్స్ పట్టభద్రులు కాదని ఉదాహరణ చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సాధించిన విజయాలను కూడా ఆమె ప్రశంసించారు.

కాగా, 2004లో లోకసభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి దూరవిద్యలో బీఏ చేసినట్లు తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో కరస్పాండెన్స్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసినట్లు చెప్పారు. దీంతో ఆమె విద్యార్హత వివాదాస్పదమైంది.

English summary
Since DU is an autonomous institution I have put forth my personal appeal to the VC to reinstate the officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X