వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీని అమేథీ తిరస్కరించింది...అందుకే మరో స్థానం: స్మృతీ ఇరానీ వ్యంగ్యాస్త్రాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాకుండా కేరళ రాష్ట్రంలోని వాయనాడు నుంచి పోటీచేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో "పారిపో రాహుల్ పారిపో" అంటూ అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. అమేథీని వీడిపోవాలని రాహుల్‌కు సూచించారు. అమేథీ ప్రజలు ఎలాగూ తనను తిరస్కరిస్తారని ఓడగొడుతారని గ్రహించిన రాహుల్ గాంధీ మరో సురక్షితమైన స్థానం కోసం వెతుక్కుంటున్నారని అన్నారు.

Smriti Iranis jibe over invite to Rahul to contest from Wayanad

ఇక ఇందుకు రుజువుగా అమేథీ కాకుండా మరో పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచిస్తూ అమేథీ జిల్లా కాంగ్రెస్ కమీటీ రాసిన ఓ లేఖను ఆమె ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓటమిపాలయ్యే అవకాశం ఉండటంతో స్వయంగా జిల్లా కాంగ్రెస్ కమిటీనే మరో సురక్షితమైన స్థానం నుంచి రాహుల్ పోటీచేయాల్సిందిగా కోరుతున్నారని ఆమె అన్నారు. అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ పై స్మృతీ ఇరానీ బరిలో ఉన్నారు. 2014కు అమేథీ నుంచి స్మృతీ ఇరానీపై రాహుల్ గాంధీ లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్

ఇక దక్షిణ భారతదేశం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే ముందుగా ఒప్పుకోకపోయినప్పటికీ ఆ తర్వాత కేరళలోని వాయనాడు నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీచేసేందుకు ఒప్పుకున్నారని కేరళ కాంగ్రెస్ ఛీఫ్ ముళ్లపల్లి రాంచంద్రన్ తెలిపారు. వాయనాడ్ నియోజకవర్గం కేరళ, కర్పాటక సరిహద్దులో ఉంది. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఇటు కేరళలో అటు కర్నాటకలోని కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
Amid demand for Congress president Rahul Gandhi's candidature from Wayanad, Smriti Irani took a dig at Amethi MP and said that after being rejected by people of his constituency, Gandhi staged the call from Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X