వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళల రంగుపై సభలో గందరగోళం: స్మృతి ఇరానీపై శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళల ఛాయపై సోమవారం రాజ్యసభలో జేడీయూ ఎంపీ శరద్ యాదవ్‌కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం సాగింది. మహిళల పట్ల అనుచితి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐతే తాను చేసిన వ్యాఖ్యలపై సోమవారం రాజ్యసభలో స్పందించారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వాదించిన శరద్ యాదవ్, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాను నిజంగానే చెపుతున్నట్టు తెలిపారు. "భారత్‌లో నల్లగా ఉండే మహిళలు ఎక్కువ. ప్రపంచంలో కూడా వీరి సంఖ్య ఎక్కువ. ఈ వ్యాఖ్యలపై తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా" అని అన్నారు.

Smriti Irani slams unapologetic Sharad Yadav over 'women's colour' remarks

గాంధీ నుంచి లోహియా వరకు మహిళలపై చేసిన వ్యాఖ్యలు తన వద్ద రికార్డుగా ఉన్నాయని అన్నారు. మహిళల నలుపు రంగుపై ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంలో దక్షిణాది మహిళల రంగుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. మహిళల చర్మం రంగు గురించి ఎలాంటి కామెంట్లు చేయవద్దని స్పీకర్ సమక్షంలో కోరారు.

ఒక సీనియర్ మెంబర్‌గా మీరు చేసిన ఈ వ్యాఖ్యలు మిగతా దేశాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. దీనిపై "నువ్వేంటో నాకు తెలుసు" అని శరద్ యాదవ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ సహా ఇతర పార్టీల ఎంపీలు శరద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

అంతక ముందు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తి శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. దక్షిణాది మహిళలతో పాటు శరద్ యాదవ్ నాపై కూడా కామెంట్ చేశారు. ఐతే ఈ కామెంట్లకు తాను మాత్రం దూరంగా ఉన్నట్లు సభకు తెలియజేశారు.

గత వారం రాజ్యసభలో ఇన్యూరెన్స్ బిల్లు సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మీ దేవుడేమో రవిశంకర్ ప్రసాద్ (ఎంపీ)లాగా నల్లనివాడు. మీ మ్యారేజి బ్యూరో యాడ్స్‌లో మాత్రం తెల్లని వధువులు కావాలని ప్రకటనలిస్తారు" అని దక్షిణ భారతదేశానికి చెందిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అనంతరం ఆయన మహిళల అందంపై గురించి మాట్లాడారు. "దక్షిణ భారతదేశంలో మహిళలు నల్లగా ఉంటారు. అయితే, వారి అందం కూడా వారి శరీరాల్లాగే ఉంటుంది. వారికి నాట్యం గురించి తెలుసు" అని అన్నారు.

English summary
Rajya Sabha on Monday witnessed sharp exchanges between JD(U) MP Sharad Yadav and human resource development minister Smriti Irani over the former's comments on women's complexion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X