వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంభమేళాకు దేశవిదేశాల ప్రతినిధులు... పుణ్యస్నానమాచరించిన స్మృతి ఇరానీ

|
Google Oneindia TeluguNews

అర్ధకుంభమేళా మహాక్రతువుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. మకర సంక్రాంతి నాడు మొదలయ్యే ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తుంటారు. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతుంటారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుంభమేళా ప్రారంభమైన తొలిరోజే (మంగళవారం) ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. గంగా నదిలో పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళా కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల నుంచి తరలివచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి అర్ధ కుంభమేళా కావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ఈ కుంభమేళాను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా యునెస్కో గుర్తించడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

smriti irani went to kumbh mela, shared pic in twitter

కుంభమేళాకు 71 దేశాల ప్రతినిధులు హాజరవుతారని అంచనా. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అంతేకాదు వీరి రాక కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలోకి ఇతర వాహనాలు రాకుండా నిషేధాజ్ఞలు కూడా విధించింది.

English summary
The vip's have been queuing up for the kumbh mela. The first day of the commencement, the Union Minister Smriti Irani special rituals were held in the river Ganga. The photo of this, posted in Twitter platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X