వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady SI: క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ భర్త లేడు, మేడమ్ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి, ఏం పని అంటే, ఫినిష్ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుచ్చి: శాంతి భద్రతలు కాపాడవలసిన ఓ లేడీ ఎస్ఐ పక్కదారి పట్టింది. భర్తను వదిలేసి పిల్లలతో కలిసి వేరుగా కాపురం ఉంటున్న లేడీ ఎస్ఐ తీరుపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆ లేడీ ఎస్ఐ కొందరు సంఘ వ్యతిరేక శక్తులతో లింక్ పెట్టుకుంది. అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారితో స్నేహం చేసింది. ఒక పోలీసు అధికారి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గంజాయి వ్యాపారి ఉండటం కలకలం రేపింది. ఆ దెబ్బతో క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. వెంటనే లేడీ ఎస్ఐను సస్పెండ్ చేసిన పోలీసు అధికారులు విచారణకు ఆదేశించడంతో సాటి పోలీసు అధికారులు షాక్ కు గురైనారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ

క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ

తమిళనాడులోని తిరుచనాపల్లి (తిరుచ్చి) సిటీ నేర విభాగం (క్రైమ్ బ్రాంచ్)లో భువనేశ్వరి (37) సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ లో పని చేస్తున్న భవనేశ్వరికి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. లేడీ ఎస్ఐ భువనేశ్వరికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విభేదాల కారణంగా భువనేశ్వరి పిల్లలతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నారు.

లేడీ ఎస్ఐ చేతివాటం

లేడీ ఎస్ఐ చేతివాటం

భర్తకు దూరంగా ఉంటున్న లేడీ ఎస్ఐ భువనేశ్వరి నేరస్తులను భయపెట్టి భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా దర్యాప్తు, విచారణ పేరుతో లేడీ ఎస్ఐ భువనేశ్వరి అనేక మంది నేరస్తులతో పరిచయం పెంచుకుంది. లేడీ ఎస్ఐ భువనేశ్వరి ఆటలను ఆడిగేవారు కరువయ్యారు.

లేడీ ఎస్ఐ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి

లేడీ ఎస్ఐ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి

లేడీ ఎస్ భువనేశ్వరి ఇంటికి ఎవరెవరో వచ్చి వెలుతున్నారని పై పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు ఆమెపై నిఘా వేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో లేడీ ఎస్ఐ భువనేశ్వరి ఇంటికి వెళ్లాడు. రహస్యంగా ఆంధ్రా వ్యాపారి లేడీ ఎస్ఐ భువనేశ్వరి ఇంటికి వెళ్లిన విషయం ఆమె సీనియర్ పోలీసు అధికారులకు తెలిసింది.

లేడీ ఎస్ఐ ఇంట్లో ఏం పని ?

లేడీ ఎస్ఐ ఇంట్లో ఏం పని ?

ఎవ్వరు లేని సమయంలో లేడీ ఎస్ఐ భువనేశ్వరి ఇంట్లో ఆంధ్రా వ్యాపారి మాత్రమే ఉన్న సమయంలో సీనియర్ పోలీసు అధికారులు ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆంధ్రా వ్యాపారి గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ కు గురైనాడు. వ్యాపారం ముసుగులో ఆ ఆంధ్రప్రదేశ్ వ్యాపారి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

దొంగా.... పోలీసు... గంజాయి

దొంగా.... పోలీసు... గంజాయి


లేడీ ఎస్ఐ భువనేశ్వరి ఇంట్లో ఉన్న ఆంధ్రా వ్యాపారి గురించి పోలీసు అధికారులు ఆరా తీశారు. ఇటీవల గంజాయి అక్రమంగా తరలిస్తున్న సమయంలో ఆంధ్రా వ్యాపారి సోదరుడిని స్వయంగా లేడీ ఎస్ఐ భువనేశ్వరి అరెస్టు చేశారని సీనియర్ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. వెంటనే లేడీ ఎస్ఐ భువనేశ్వరిని సస్పెండ్ చేసిన అధికారులు విచారణకు ఆదేశించారు.

 మేడమ్.....ఇళ్లు ఖాళీ చెయ్యండి

మేడమ్.....ఇళ్లు ఖాళీ చెయ్యండి

లేడీ ఎస్ఐ భువనేశ్వరి ఆగడాలకు సహకరిస్తూ ఇటీవల మెట్రోపాలిటన్ ప్రాంతానికి బదిలి అయిన కమిషనర్ అమల్ రాజ్ పైన వేటు పడింది. కమిషనర్ అమల్ రాజ్ ను పై అధికారులు సస్పెండ్ చేశారు. అంతే కాకుండా లేడీ ఎస్ఐ భువనేశ్వరిని వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని పోలీసు క్వారంటర్స్ లో ఉంటున్న కుటంబాలు పై అధికారులు మనవి చేశారు. లేడీ ఎస్ఐ భువనేశ్వరిని వెంటనే పోలీసు క్వాటర్స్ లోని ఇంటిని ఖాళీ చెయ్యాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నాకేం తెలీదు

నాకేం తెలీదు

లేడీ ఎస్ఐ భువనేశ్వరి సంఘ వ్యతిరేక శక్తులతో స్నేహం చేసి వారితో లింక్ పెట్టుకుందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసి ఆమెను తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణలో లేడీ ఎస్ఐ భువనేశ్వరి పొంతనలేని సమాచారం ఇస్తోందని, తన ఇంటికి ఆంధ్రా వ్యాపారి, స్మగ్లర్ సోదరుడు ఎందుకు వచ్చాడో తనకే తెలీదని ఆమె అంటోందని, కేసు విచారణలో ఉందని తమిళనాడు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Smuggler: Tamil Nadu Trichy woman police sub inspector dismissed for disorderly conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X