వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Padma Awards: పాములు పట్టే వారికి పద్మశ్రీ అవార్డు.. ఇదే నిజమైన గుర్తింపు..!

తమిళనాడుకు చెందిన పాములు పట్టే ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. తమిళినాడుకు చెందిన పలువురికి పద్మ అవార్డులు వచ్చాయి. ఇందులో పాములు పట్టే వడివేల్ గోపాల్, మాసి సదయ్యన్‌లకు పదశ్రీ అవార్డులు వచ్చాయి. వారిని గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి అభినందించారు. కరూర్‌లో పాములు పట్టుకుంటున్న సమయంలో పద్మశ్రీ అవార్డు వచ్చిందని ఫోన్‌లు వచ్చాయని వారు తెలిపారు.

పాములను పట్టుకునే కళ

పాములను పట్టుకునే కళ

తమకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయంటే ఒక క్షణం నమ్మలేకపోయామని చెప్పారు. ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఫలితం దక్కిందని ఇరుల తెగకు చెందిన మాసి, వడివేలు ఆనందం వ్యక్తం చేశారు. వీరు ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులోని వాడ నెమ్మెలిలోని ఇరులార్‌ స్నేక్‌ క్యాచర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ సభ్యులుగా ఉన్నారు. వీరు తమ తండ్రుల వద్ద విషపూరిత పాములను పట్టుకునే కళను నేర్చుకున్నారు.

అమెరికా వరకు

అమెరికా వరకు

చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో వడివేల్ గోపాల్, మాసి సదయ్యన్‌ ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరు వంశ పారంపర్యగా వస్తున్న నేర్చుకున్న విద్యతో ఈ ఇద్దరు అమెరికా వరకు తమ సేవలను అందించారు. తమిళనాడుకు చెందిన ఆరుగురికి పద్మ అవార్డులు వచ్చాయి. వీరిలో గాయని వాణీ జయరాంకు పద్మ విభూషణ్‌ రాగా..
మిగిలిన వారికి పద్మశ్రీ వచ్చింది.

పేద విద్యార్థుల చదువు కోసం

పేద విద్యార్థుల చదువు కోసం

కల్యాణ సుందరం పిళ్‌లై (కళ) పాలం కల్యాణ సుందరం (సామాజిక సేవ), గోపాల్‌ స్వామి వేలుస్వామి (వైద్యం)కు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. వైద్య సేవలు అందించినందుకు గోపాల్‌ స్వామి వేలుస్వామికి, భరత నాట్యంలో కల్యాణ సుందరం పిళైకు, 30 సంవత్సరాలకు పైగా తన పొదుపు మొత్తాన్ని పేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించినందకు పాలం కల్యాణ సుందరంకు అవార్డులు వచ్చాయి.

English summary
Two snake charmers from Tamil Nadu have received Padma Shri awards. Patte Vadivel Gopal and Masi Sadayyan received Padashree awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X