వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటిలోనే పాముల పుట్టలు, వాటితోనే నివాసం, వామ్మో.. అసలు నిద్రెలా పడుతుందో?

ఒడిషా రాష్ట్రంలోని సాలూరు మండలం గాంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని పనుకులోవలో మజ్జి కనుపూరి అనే వ్యక్తి ఇంటిలోనే పాములు పుట్టలు కనిపిస్తాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: పొలం గట్లపై పాముల పుట్టలు ఉంటేనే అటుగా వెళ్లేందుకు మనం జంకుతాం.. వాటికి దూరంగా నడుస్తాం. అలాంటిది ఓ ఇంటి యజమాని ఏకంగా తన ఇంటిలోని పాముల పుట్టల మధ్యనే బతికేస్తున్నాడు.

సాలూరు మండలంలోని గాంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని పనుకులోవలో మజ్జి కనుపూరి అనే వ్యక్తి ఇంటిలోనే పాములు పుట్టలు కనిపిస్తాయి. అందులో నాగదేవత(నాగుపాము) ఉంటుందని గ్రామస్థులు నమ్ముతారు.

దీంతో నిత్యం అతడి ఇల్లు సందడిగా ఉంటుంది. గ్రామస్థులు వచ్చి పూజలు చేస్తారు. పుట్టలో పాలుపోస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, ఏ కార్యం జరగాలన్నా నాగమ్మను కొలుచుకుని బయటకు వెళ్తారు.

Snake Mounds in a Villager's House in Odisha

ఉదయం వేళల్లో ఇంటి పెడకలో, సమీప అడవిలోకి నాగమ్మ వెళ్తుందని, రాత్రి వేళల్లో పుట్టలోకి రావడం, లేదంటే ఇంటిలో ఏదైనా ఓ స్థలంలో మండివేసి ఉంటుందని ఇంటి యజమాని కనుపూరి చెబుతుంటారు.

నాగమ్మ(పాము) ఎదురైనా నెమ్మదిగా వెళ్లిపోతుందని, ఎవ్వరికి ఏ హాని చేయదని చెబుతున్నారు. అనాదిగా ఇంటిలో పుట్టలు ఉన్నాయని, అందులో నాగమ్మ ఉంటుందని, ఇప్పటి వరకు ఎవ్వరికి ఏ హాని చేయలేదని తెలుపుతున్నారు.

చాలా పెద్ద నాగదేవత ఉన్న ఈ పుట్టకు గ్రామస్థులంతా వచ్చి పూజలు చేస్తుంటారు. స్థానికంగా నిర్మించిన వాటర్‌ట్యాంకును పరిశీలించేందుకు గ్రామానికి వచ్చిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ గాయత్రిదేవి కనుపూరి ఇంటిలోని పుట్టలను చూసి ఆశ్చర్యపోయారు.

నాగమ్మను తాము ఇంటి దైవంగా కొలుస్తున్నామని, నాగమ్మ ఎవ్వరికీ హాని చేయదని, గ్రామస్థులంతా నాగమ్మకు పూజచేసి పనులకు వెళ్తారని, ఉదయం వేళల్లో ఇంటి వెనక సమీప అడవిలోకి నాగమ్మ వెళ్తుందని, రాత్రి వేళల్లో తిరిగి ఇంటిలోని పుట్టలోకి చేరుతుంది అని మజ్జి కనుపూరి పేర్కొంటున్నారు.

English summary
A villager, named Majji Kanupuri who is residing in Panukulova village which is under the Ganjayibhadra Panchayat of Salur Mandal of Odisha State is staying in his house along with Snakes Mounds per the past many years. Villagers of Panukulova believe that Nagadevata is residing in that snake mound and daily they come to Kanupuri's house to pray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X