Snake VS Dankey: దేని భయం దానిదే, గంట పోరాటం, కాలం కలిసిరాలేదు, కథ క్లైమాక్స్, వైరల్ !
జైపూర్/ రాజస్థాన్: పులి, సింహం, మొసటి, ఎలుగుబంగి, ఖడ్గమృగం, పాము, ముంగీస, ఎలుక, పిల్లి ఇలా గొడవలు పడే సన్నివేశాలు మనం సాధారణంగా అక్కడక్కడ చూస్తుంటాము. అయితే ఆడుకుంటున్న ఓ పాము, ఆహారం కోసం వెళ్లిన ఓ గాడిద పోట్లాడుకున్నాయి. సుమారు గంట సేపు యుద్దం చేసిన పాము, గాడిద చివరికి కథకు ఫుల్ స్టాప్ పెట్టాయి. పాము, గాడిద పోరారటం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి దానిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజవంసస్థులకు పెట్టింది పేరుగా నిలయం అయిన రాజస్థాన్ లో ఈ సంఘటన జరిగింది.
Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

ఆడుకుంటున్న పాము, ఆహారం కోసం గాడిద
రాజస్థాన్ లోని ప్రతాప్ గడ్ జిల్లాలోని మహానది సమీపంలోని పచ్చటి పోలాల సమీపంలో మంగళవారం ఓ పాము ఆడుకుంటున్నది. అదే సమయంలో సమీపంలోని గ్రామానికి చెందిన ఓ గాడిద ఆహారం కోసం అటువైపు వెళ్లింది. మేత మేసుకుంటూ వెళ్లిన గాడిద పచ్చటి గడ్డి కనపడటంతో అటు వైపు వెళ్లింది. అక్కడ పాము ఉన్న విషయం గాడిద గుర్తించలేకపోయింది.

గడ్డితో పాటు పామును కొరికిన గాడిద !
పచ్చటి గడ్డి కనపడటంతో ఆత్రుతగా తింటున్న గాడిద అందులో పాము ఉన్న విషయం గుర్తించలేకపోయింది. అదే సమయంలో అక్కడికి గాడిద వచ్చిన విషయం పసిగట్టలేని పాము అక్కడే ఉంది. పచ్చటి గడ్డితో పాటు పామును కూడా పట్టుకున్న గాడిద దానిని నోట్లో పెట్టుకుని ఒక్కసారిగా నమిలేయడానికి ప్రయత్నించింది.

దేని భయం దానిదే
పామును వదిలించుకోవడానికి గాడిద నానా ప్రయత్నాలు చేసింది. అప్పటికే అర్దం పామును గాడిద నోట్లో పెట్టేసుకుని కొరికేసింది. గాడిద నోట్లో నుంచి బయట పడటానికి పాము కూడా అనేక ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో అటువైపు వెళ్లిన స్థానిక నివాసి పాము, గాడిద పోట్లాటను అతని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. పామును వదిలేస్తే తనను కాటు వేస్తోందని గాడిద బయటపడినట్లు ఉంది. అదే సమయంలో తప్పించుకోకపోతే తనను గాడిద కొరికి చంపేస్తోందనే భయంతో పాము దాని నోట్లో నుంచి బయట పడటానికి విఫలయత్నం చేసింది.

గంటలో పాము, గాడిద ప్రాణాలు హుష్ కాకి
సుమారు గంట పాటు పాము, గాడిదల మద్య పెనుగులాట జరిగింది. అప్పటికే ఆ గాడిద భయంతో పామును అర్దభాగం కొరికి నమిలేసింది. పాము తలతో పాటు కొంచెం భాగం మాత్రమే బయటకు కనపడుతోంది. సుమారు గంటపాటు పాము, గాడిద పోరాటం చేశాయాయి. తరువాత పాము విషయం శరీరంలోకి వెళ్లడంతో గాడిద, గాడిద కొరికి వేయడంతో పాము ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సర్వసాధారణంగా పాములు జిరాఫీలతో గొడవ పడుతుంటాయి. అయితే ఇక్కడ పాము, గాడిద పోరాటం చేసి ఒకదాని ప్రాణాలు ఒకటి తీసుకున్నాయి. స్థానిక వ్యక్తి మొబైల్ లో రికార్డు చేసిన పాము, గాడిద పోరాటం వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.