వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్‌పై క్షేమంగా తిరిగొచ్చిన స్నాప్‌డీల్ ఉద్యోగిని

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కనిపించకుండా పోయిన దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌కు చెందిన ఉద్యోగిని దీప్తీ సర్నా(24) క్షేమంగా తిరిగొచ్చింది. దీప్తి శుక్రవారం ఉదయం ఫోన్‌ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

గుర్గావ్‌లో బుధవారం సాయంత్రం దీప్తి తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఆమె అపహరణకు గురైంది. రోజూ మెట్రోలో వెళ్లే దీప్తి బుధవారం ఆటోలో ఇంటికి వెళుతున్న సమయంలో బెంగళూరులో ఉన్న తన స్నేహితురాలికి ఫోన్‌ చేసింది.

Snapdeal employee Dipti found mysteriously, was missing from Ghaziabad

అప్పుడే ఆటో డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో వెళుతున్నాడని అతనిపై అరుస్తున్నట్లు ఫోన్‌లో వినిపించిందని దీప్తి స్నేహితురాలు తెలిపింది. ప్రస్తుతం దీప్తి క్షేమంగానే ఉన్నట్లు తెలియడంతో స్నాప్‌డీల్‌ యాజమాన్యం, ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, తాను ఆటోలో ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు తనను కిడ్నాప్ చేశారని దీప్తి తెలిపింది. తన కళ్లకు గంతలు కట్టు మీరట్ వరకు తీసుకెళ్లారని చెప్పింది. తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని చెప్పింది. ఆ తర్వాత తనను నరేలా ప్రాంతంలో వదిలిపెట్టినట్లు దీప్తి తెలిపిందని సీనియర్ పోలీస్ అధికారి ధర్మేంద్ర సింగ్ తెలిపారు. అయితే, దీప్తి ఫోన్, బ్యాగ్ మిస్సయ్యాయని చెప్పారు.

English summary
The 24 year old Snapdeal employee Dipti Sarna who went missing on Wednesday night has been found and is back with her family now. The police said Dipti called this morning to say that she is safe and on a train from Panipat to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X