సోషల్ మీడియా తంటా... ఉరిపెట్టు పెట్టుకుంటూ వీడియో...! నిజంగానే బిగిసిన ఉరితాడు....!
సోషల్ మీడియా మాయలో పడి యువతి యువకులు అనేక జిమ్మిక్కులు పాల్పడుతున్నారు. లైక్‌ల క్రేజ్ కోసం వీడీయోలు తీసే క్రమంలో తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా రోజుకు ఎక్కడో ఓ చోట సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం తీస్తున్న వీడియోల్లో మృత్యువాత పడుతున్న దానిపై ఉన్న క్రేజ్ మాత్రం యువతలో తగ్గడం లేదు.
ఈనేపథ్యంలోనే ఎక్కడ జరిగిందో తెలియదు కాని ఓ వీడియో మాత్రం అదే సోషల్ మీడియాతో పాటు మిడీయాలో కూడ చక్కర్లు కోడుతోంది. ఓ యువతి వీడియోలో భాగంగా ఉరివేసుకుని ఫీట్లు చేయాలని భావించింది. ఉరి తాడును నుండి రక్షించుకోవడం ఎలాగో తెలపాలని భావించినట్టుంది.
ఇందులో భాగంగానే ఉరిపెట్టుకుంటూ ఓ వీడియో తీయబోయింది. అనుకున్నట్టుగా క్రింద ఉన్న స్టూల్‌ను తన్ని లైక్‌లు తీసుకోవాలని భావించింది. కాని మెడకు వేసుకున్న ఉరితాడు బిగియడంతో గిలగిలా కొట్టుకుంది. ఉరిబిగిస్తూంటే నోరుతెరిచి అరిచింది. అదృష్టం తలుపుతట్టి ఇంట్లోనే తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చి ఆమేను క్రిందకు దించారు. లేదంటే యువతి చేసిన సహాసానికి ప్రాణాలు గాల్లోనే కలిసేపోయో అవకాశాలు ఉండేవి.