వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ఫరిదాబాద్: సరదాలు, ఆనందం, జల్సా కోసం ఓ శాడిస్టు కుర్రాడు సుమారు 50 మంది అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలు, ఆంటీల ఫోటోలు సేకరించి, టెక్నాలజీ ఉపయోగించి పోర్న్ వీడియో వెబ్ సైట్లలోని ఫోటోలు సేకరించి అమాయకులైన అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేశాడు. దాదాపు సంవత్సరం రోజుల నుంచి అమ్మాయిలు, యువతులను బ్లాక్ మెయిల్ చేస్తూ శునకానందం పొందుతున్న కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మనోడి దెబ్బకు దేశంలో చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసులు అంటున్నారు.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

 19 ఏళ్లకే క్రిమినల్ మైండ్

19 ఏళ్లకే క్రిమినల్ మైండ్

ఫరీదాబాద్ లో రహీమ్ ఖాన్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న అమ్మాయిలు, వివాహిత మహిళలపై రహీమ్ ఖాన్ కన్ను వేశాడు. అందమైన అమాయకులైన అమ్మాయిలు, ఆంటీల ఫోటోలను గుట్టుచప్పుడు కాకుండా స్టోర్ చేసుకుంటున్నాడు.

 పోర్న్ వీడియోలు+ ఫోటోలు మార్ఫింగ్

పోర్న్ వీడియోలు+ ఫోటోలు మార్ఫింగ్

అందమైన అమాయకులైన అమ్మాయిలు, ఆంటీల ఫోటోలను సేకరిస్తున్న రహీమ్ తరువాత పోర్న్ సైట్లలోని వీడియోలు, ఫోటోలతో ఫోటో షాప్ టెక్నాలజీ ఉపయోగించి వాటిని మార్ఫింగ్ చేస్తున్నాడు. అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోటోలను అశ్లీల చిత్రాలను తయారు చేస్తున్న రహీమ్ తరువాత అతని అసలు స్వరూపం చూపిస్తున్నాడు.

 ఇది రహీమ్ ప్లాన్

ఇది రహీమ్ ప్లాన్

ఎవరైనా పర్సనల్ గా సోషల్ మీడియా అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారితో స్నేహం చేసుకోవడానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాడు. వారికి మాయమాటలు చెప్పిన రహీమ్ తరువాత వారితో సోషల్ మీడియాలో స్నేహం చేసినట్లు నటించి వారి ఫోటోలను సేవ్ చేసుకుంటున్నాడు. తరువాత వారి ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్ చేసి వాటిని స్టోర్ చేసుకుంటున్నాడు.

 నగ్న వీడియోలు, ఫోటోల కోసం బ్లాక్ మెయిల్

నగ్న వీడియోలు, ఫోటోల కోసం బ్లాక్ మెయిల్

మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, అలా చెయ్యకూడదు అంటే మీరు నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తనకు పంపించాలని రహీమ్ అమాయకులైన అనేక మంది అమ్మాయిలు, వివాహిత మహిళలను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇలా రహీమ్ అనేక మందిని బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగి కూలీలాగితే రహీమ్ విషయం బయటపడింది.

 వీడు సామాన్యుడు కాదు

వీడు సామాన్యుడు కాదు

రహీమ్ ను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు అతన్ని బెండ్ తీశారు. తాను ఆనందం కోసం, సరదా కోసం అమ్మాయిలు, మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేశానని, తనకు వేరే ఉద్దేశం లేదని రహీమ్ విచారణలో అంగీకరించాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి ఓ ఆంగ్ల పత్రికకు చెప్పాడు. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి తాను సోషల్ మీడియాలో సేకరించిన అమాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేశానని రహీమ్ అంగీకరించాడని ఆ పోలీసు అధికారి అన్నారు.

 ఏడాది చుక్కలు చూపించిన కిలాడీ

ఏడాది చుక్కలు చూపించిన కిలాడీ

ఒక సంవత్సరం నుంచి ఎవ్వరికీ చిక్కకుండా అమాయకులైన అమ్మాయిలు, వివాహిత మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడని స్వయంగా అతనే అంగీకరించాడని, అతని బాధితుల్లో మైనర్లు (అమ్మాయిలు) ఉన్నారని పోలీసులు అంటున్నారు. హర్యానా, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రహీమ్ ఖాన్ బాధితులు ఉన్నారని పోలీసులు చెప్పారు. రహీమ్ ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశాడు ?, ఆ ఫోటోలు ఏం చేశాడు ?, అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Social Media: Faridabad resident Rahim Khan, who has been arrested, stalked girls on social media and then morphed their photos & blackmailed them, said Delhi Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X