వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామిడీ: రాహుల్ గాంధీ రానందుకే కాంగ్రెస్ గెలిచిందంట: సోషల్ మీడియాలో !

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అసలు కారణం రాహుల్ గాంధీ ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడమే అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని నంజనగూడు, గుండ్లుపేటలో కాంగ్రెస్ గెలుపు అసలు కారణం ఇదే అంటూ పలువురు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. మరి కోందరు బీజేపీ ముందుగా ప్లాన్ వేసుకుని ఉంటే కచ్చితంగా గెలిచేవారు అంటూ వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి అసలు కారణం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ కర్ణాటకలో కాలు పెట్టకుండా ఉప ఎన్నికలకు దూరంగా ఉండటం వలనే ఆ రెండు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.

మీకు ముందు జాగ్రత్త లేదు అందుకే !

మీకు ముందు జాగ్రత్త లేదు అందుకే !

బీజేపీ నాయకులకు ముందు జాగ్రత్త లేదని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. బీజేపీకి ముందు జాగ్రత్త ఉంటే ఎలాగైనా కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీతో ఉప ఎన్నికల్లో ప్రచారం చేయిస్తే ఇలా జరిగేది కాదని, అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేవారు కాదని జోకులు వేస్తున్నారు.

కాంగ్రెస్ కు పోటీగా హోటల్ ఉంటే సరి

కాంగ్రెస్ కు పోటీగా హోటల్ ఉంటే సరి

కాంగ్రెస్ నాయకులు దర్జాగా స్టార్ హోటల్ లో మకాం వేసి నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారని, బీజేపీ నాయకులు పశువులపాగలో మకాం వేసి ప్రచారం చేశారని, అక్కడ గోవు మూత్రం తాగనందేకే బీజేపీకి బెడిసికొట్టందిని రాకేష్ శెట్టి అనే వ్యక్తి కామెంట్లు చేశారు.

సీఎం ఉన్నంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను

సీఎం ఉన్నంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను

కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసిన శ్రీనివాస ప్రసాద్ సీఎం సిద్దూ అసెంబ్లీలో ఉన్నంత వరకూ నేను అక్కడ అడుగుపెట్టనని బహిరంగంగా చాలెంజ్ చేశారు. తరువాత నంజనగూడు ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయారు. నిజమే మీరు చాలెంజ్ చేశారు కదా, ఇప్పుడు సిద్దరామయ్య అసెంబ్లీలో ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్లకూడదనే ప్రజలు మిమ్మల్ని ఇంటిలో కుర్చోపెట్టారని వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.

విజయరహస్యం ఇదే

విజయరహస్యం ఇదే

కర్ణాటకలో ఇక ముందు జరిగే అన్ని ఎన్నికలకు రాహుల్ గాంధీ ప్రచారం చేసేలా బీజేపీ నాయకులు చర్యలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ వస్తే కచ్చితంగా అక్కడ ప్రతిపక్షాలు గెలుస్తాయనే విషయం బీజేపీ నాయకులు తెలుసుకోవాలని, అదే మీకు విజయరహస్యం అంటూ జోకులు వేస్తున్నారు.

మొత్తం మీద

మొత్తం మీద

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అసలు కారణం రాహుల్ గాంధీ ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడమే అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు జోకులు వేస్తున్నారు. అంతే కాని సీఎం సిద్దరామయ్య తదితరులు కష్టపడి తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు అంటూ ఎవ్వరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం లేదు.

English summary
Social Media reacts to Congress victory By Poll Election Nanjangud, Gundlupet in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X