వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Social media: అమ్మాయికి డ్రగ్స్, గంజాయి, 7 మంది విద్యార్థులు ఏడాది ఎంజాయ్, తల్లి !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ తిరువనంతపురం/ చెన్నై: సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయి జీవితంతో 7 మంది చెలగాటం ఆడుకున్నారు. తండ్రి విదేశాల్లో ఉండటం, తల్లి బిజీబిజీగా ఉండటంతో 14 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడిపింది. సోషల్ మీడియా పిచ్చి ఎక్కువగా ఉన్న అమ్మాయిని 7 మంది విద్యార్థులు ఒకరికి తెలీకుండా వలలో వేసుకున్నారు. అంతే అమ్మాయికి డ్రగ్స్, గంజాయి, మత్తుమందుతో తయారు చేసిన సిగరెట్లు అలవాటు చేయించి ఏడాది పాటు ఒకరి తరువాత ఒకరు ఆమెపై అత్యాచారం చేసి ఎంజాయ్ చేశారు. 14 ఏళ్ల వయసుకే ఆ అమ్మాయి డ్రగ్స్ కు బానిస కావడం, ఆమె జీవితం నాశనం కావడం కలకలం రేపింది.

lovers: అర్దరాత్రి ప్రియురాలి బెడ్ రూమ్ లో దూరాడు, గ్రహాలు అనుకూలించక అన్న ఎంట్రీ!lovers: అర్దరాత్రి ప్రియురాలి బెడ్ రూమ్ లో దూరాడు, గ్రహాలు అనుకూలించక అన్న ఎంట్రీ!

 14 ఏళ్ల అందమైన అమ్మాయి

14 ఏళ్ల అందమైన అమ్మాయి


కేరళలోని మలప్పురం జిల్లా కల్పాకచ్చేరి ప్రాంతంలో 14 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆన్ లైన్ క్లాస్ లు కోసం తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఖరీదైన స్మార్ట్ ఫోన్ తీసిచ్చారు. ఆన్ లైన్ క్లాస్ లు పూర్తి అయిన తరువాత ఆ అమ్మాయి ఎక్కువగా సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో కాలం గడుపుతోంది.

తండ్రి విదేశాల్లో.... తల్లి బిజీబిజీ

తండ్రి విదేశాల్లో.... తల్లి బిజీబిజీ

అమ్మాయి తండ్రి విదేశాల్లో ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఉంటున్న తల్లి ఎప్పుడూ ఫ్రెండ్స్, బంధువులు, షాపింగ్ అంటూ తిరుగుతూ బిజీబిజీగా ఉండిపోయింది. సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి కూడా బయట తిరగడం మొదలుపెట్టింది. కొంతకాలం నుంచి కుమార్తె తీరుతో విదేశాల్లో ఉన్న ఆమె తండ్రికి అనుమానం వచ్చింది.

నువ్వు ఏం చేస్తున్నావ్ ?

నువ్వు ఏం చేస్తున్నావ్ ?

విదేశాల్లో ఉన్న భర్త భార్యకు ఫోన్ చేసి ఇంట్లో ఏం జరుగుతోంది ?, అమ్మాయి ఎందుకు అలా ఉంటోంది, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావ్ ? అంటూ మందలించాడు. భర్త మందలించడంతో హడలిపోయిన భార్య కుమార్తె తీరును ప్రశ్నించింది. ఎప్పుడు మైకంగా ఉంటున్న కుమార్తె తీరుతో భయపడిన ఆమె తల్లి, బంధువులు కలిసి స్థానిక కల్పాకచ్చేరి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 అమ్మాయి సమాధానంతో మైండ్ బ్లాక్

అమ్మాయి సమాధానంతో మైండ్ బ్లాక్

పోలీసులు అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించారు. అమ్మాయి డ్రగ్స్, గంజాయితో పాటు వివిద మత్తు మందులకు బానిస అయ్యిందని, చాలా కాలం నుంచి ఆమె వాటిని ఉపయోగిస్తోందని వైద్యులు చెప్పారు. పోలీసులు ఆ బాలికను మెల్లిమెల్లిగా విచారణ చేశారు. ఇదే సమయంలో బాలిక చెప్పిన సమాధానంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

ఏడు మంది ఆడుకున్నారు

ఏడు మంది ఆడుకున్నారు

ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో తనకు 7 మంది అబ్బాయిలు పరిచయం అయ్యారని, వాళ్లు ఆన్ లైన్ లోనే తనకు చాటింగ్ చేస్తూ గంజాయి, మత్తు మందు, డ్రగ్స్ సిగరెట్లు పార్శిల్ పంపించారని అమ్మాయి పోలీసులకు చెప్పింది. అనంతరం తనను ఇంటి నుంచి బయటకు పిలిపించుకుని వెళ్లిన ఏడు మంది తనతో డ్రగ్స్ సిగరెట్లు తాగించి అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు సమాచారం ఇచ్చింది.

డ్రగ్స్, గంజాయి సిగరెట్లు... వన్ బై వన్

డ్రగ్స్, గంజాయి సిగరెట్లు... వన్ బై వన్

తన మీద అత్యాచారం చేసిన ఏడు మంది విద్యార్థులే అని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే తనను లొంగదీసుకోవడానికి డ్రగ్స్, గంజాయి నింపిన సిగరెట్లు తాగించారని, తాను మత్తులోకి జారుకున్న తరువాత తన మీద అత్యాచారం చేసేవాళ్లని ఆ అమ్మాయి పిన్ టూ పిన్ పోలీసులకు చెప్పింది.

కామాంధులు అరెస్టు.... ఎస్కేప్

కామాంధులు అరెస్టు.... ఎస్కేప్

గత ఏడాది నుంచి తనకు మత్తు మందు, డ్రగ్స్ ఇచ్చి 7 మంది అనేకసార్లు అత్యాచారం చేశారని అమ్మాయి పోలీసులకు చెప్పింది. అమ్మాయి జీవితంతో చెలగాటం ఆడిన 7 మంది విద్యార్థుల వివరాలను ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు ఏర్నాకుళంలో ఒకరిని, కోజికోడ్ లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి నుంచి పరారైన మరో ఐదు మంది విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 14 ఏళ్ల అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ఏడాది పాటు 7 మంది విద్యార్థులు అత్యాచారం చేశారని వెలుగు చూడటం కేరళలో కలకలం రేపింది.

English summary
Social media: Seven students raped a 14-year-old girl by giving various drugs Kerala, including cannabis. police arrested 2 youths, 5 are escaped from home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X