వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటది హార్ట్ బీటా.. ఈసీజీలా ఉందే.. ట్రంప్ సంతకంపై సోషల్ మీడియాలో ఎన్ని సెటైర్లో..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంపై సోషల్ మీడియాలో ఫుల్లుగా సెటైర్స్ పేలుతున్నాయి. సబర్మతీ ఆశ్రమం విజిటర్స్ డైరీలో,అలాగే తాజ్‌మహల్ విజిటర్స్ డైరీలో ఆయన చేసిన సంతకం చూసి నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఇదేం సంతకం.. ఇదేదో ఈసీజీ(హార్ట్ బీట్‌ను పరీక్షించేందుకు చేసే మెడికల్ టెస్ట్)లా ఉందని సెటైర్స్ వేస్తున్నారు. ఓ నెటిజెన్ 'ట్రంప్ సంతకాన్ని చూస్తుంటే.. ఇంజనీరింగ్‌లో తాను గీసిన సైన్ వేవ్ గుర్తొస్తోందని కామెంట్ చేశాడు.

ఓ నెటిజెన్ ట్రంప్ సంతకాన్ని ఎవరైనా కెమిస్ట్ డీకోడ్ చేయగలరా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. మరో నెటిజెన్ 'నేను ట్రంప్ సంతకాన్ని ఫార్మాసిస్ట్‌కు చూపిస్తే.. నాకు మూడు రోజులకు సరిపడా మందులు రాశాడు..' అని కామెంట్ చేశాడు.మరో నెటిజెన్.. ట్రంప్ సంతకాన్ని చూస్తుంటే.. కొత్త పెన్ సరిగా రాయకపోతే.. పేపర్‌పై గీకినట్టుందని అన్నాడు. మరో నెటిజెన్ అయితే.. ట్రంప్ సంతకాన్ని ఏకంగా గేట్2021 ప్రశ్నగా పేర్కొన్నాడు. ట్రంప్ సంతకంలో ఆర్ఎంఎస్ విలువ కనుక్కోవాలని.. అది హాఫ్ వేవ్ సిమెట్రీలో ఉందా అని ప్రశ్నిస్తూ.. ఇది రెండు మార్కుల ప్రశ్న అని చెప్పాడు. ఇక మరో నెటిజెన్.. ఇది మోదీ ఆలింగనం చేసుకున్నప్పుడల్లా ట్రంప్‌ గుండె కొట్టుకున్న తీరు అంటూ కామెంట్ చేశాడు.మొత్తానికి ట్రంప్ పర్యటనతో పాటు ఆయన సిగ్నేచర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 social media trying to decode trumps signature on sabarmathi ashram diary

భారతదేశ పర్యటనలో భాగంగా మొదటిరోజు అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ మొతేరా స్టేడియంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన తన సతీమణి మెలానియాతో కలిసి సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ట్రంప్ విజిటర్స్ డైరీలో 'ఇంత అద్భుతమైన పర్యటనకు ఆహ్వానించినందుకు.. నా గొప్ప మిత్రుడు నరేంద్రమోదీకి ధన్యవాదాలు' అంటూ రాశారు. కిందనే తన సంతకం కూడా చేశారు. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తాజ్‌మహల్ సందర్శన సందర్భంగానూ విజిటర్స్ డైరీలో ఆయన సంతకం చేశారు. ఈ రెండు సంతకాలను చూసి నెటిజెన్స్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

English summary
All eyes were glued on US President's Air Force One as Donald Trump along with First Lady Melania Trump touched down at the airport in Ahmedabad on Monday, where they were received by Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X