చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీ ఫోటోలు పోర్న్ సైట్లలో పెడుతా: టెక్కీ అరెస్టు

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రియురాలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుందని అనుమానంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. మెర్సిల్ (28) అనే టెక్కీని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.

మ్యాట్రీమొనీ సైట్ ద్వారా ఓ 38 ఏళ్ల మహిళ టెక్కీ మెర్సిల్ కు పరిచయం అయ్యింది. ఇద్దరు ఫేస్ బుక్, వాట్సాప్ లో చాటింగ్ చేసుకునే వారు. ఇద్దరూ ప్రేయించుకుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మెర్సిల్ కు రూ. 50 వేలకు పైగా జీతం వస్తోంది.

Software engineer held for harassing woman who spurned proposal

అనేక సార్లు వీరు బయట ఏకాంతంగా కలుసుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతున్న సమయంలో ఆమె అడ్డం తిరుగుతున్నదని మెర్సిల్ కు అనుమానం వచ్చింది. ఎక్కడ ఆమె దూరం అవుతుందో అని ఆందోళన చెందాడు.

తాను చెప్పిన టైంకి నీవు కలుసుకోకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని మెర్సిల్ ఆమెను బెదిరించాడు. మనం కలుసుకున్న ఫోటోలను నీలి చిత్రాల వెబ్ సైట్ల (పోర్న్ సైట్లు)లో పెడుతానని, తన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తానని ఆమెను బెదిరించాడు.

మెర్సిల్ బ్లాక్ మెయిల్ తో ఆందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి మెర్సిల్ ను అరెస్టు చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.

English summary
Jerome (28) was arrested on Monday on a complaint from the woman, 38, they said, adding both had uploaded their profiles on a matrimony website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X