వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Solar Eclipse 2020: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం నేడే, భారత్‌లో కనిపిస్తుందా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాల్లో ఇప్పటికే ఐదు గ్రహణాలు సంభవించాయి. వీటిలో నాలుగు చంద్ర గ్రహణాలు, ఒక సూర్య గ్రహణం ఏర్పాడ్డాయి. మరో సూర్య గ్రహణం డిసెంబర్ 14న ఏర్పడనుంది. ఇదే ఈ ఏడాదిలో ఏర్పడే చివరి గ్రహణం కావడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇది రెండో సూర్య గ్రహణం. ఈ సూర్య గ్రహణానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

Recommended Video

2020లో చివరి సూర్యగ్రహణం ఇదే..! ఏ సమయంలో అంటే..!
డిసెంబర్ 14న సూర్య గ్రహణం..

డిసెంబర్ 14న సూర్య గ్రహణం..

జూన్ 21, 2020న మొదటి సూర్యగ్రహణం సంభవించగా.. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడనుంది. ఈ ఏడాది చివరలో సంభవించే చివరిదైన ఈ సూర్య గ్రహణం భారతదేశంలో ఐదు గంటలపాటు ఉంటుంది. సూర్యగ్రహణం డిసెంబర్ 14న రాత్రి 7.03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.23 గంటలకు ముగియనుంది. రాత్రి 8.02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9.43గంటలకు పూర్తిస్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడనుంది.

భారత్‌లో కనిపించని సూర్య గ్రహణం.. ఎందుకంటే?

భారత్‌లో కనిపించని సూర్య గ్రహణం.. ఎందుకంటే?

కాగా, ఈ సూర్య గ్రహణం భారతదేశంలో మనకు కనిపించదు. ఈసారి రాత్రి సమయంలో ఏర్పడుతుందడటంతో సూర్యూడు కనిపించే అవకాశం లేదు. దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని ఏర్పడుతుంది. శాంటియాగో(చిలీ), సోవాపాలో(బ్రెజిల్), బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా), లిమా(పెరూ), మాంటెవీడియో(ఉరుగ్వే), అసున్సియన్(పరాగ్వే) దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.

గ్రహణం నీడ పడకుండా...

గ్రహణం నీడ పడకుండా...

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సూర్య గ్రహణం సమయంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రహణ సమయంలో చాలా మంది పదునైన వస్తువులను ఉపయోగించరు. గర్భిణీలు సూర్యగ్రహణం సమయంలో ఇంటి బయటకు వెళ్లరు. ఇంట్లో పూజ గదిలో సూర్య గ్రహణం నీడ పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఏదైనా దానం చేయాలనుకున్న వస్తువులను గ్రహణం ఏర్పడక ముందే ఇంటి బయట పెడతారు. సూర్య గ్రహణం ముగిశాక వాటికి దానం చేయడం మంచిదని భావిస్తారు. గ్రహణం ఏర్పడకు ముందే రాత్రి పూట భోజనం చేస్తారు. కొందరు గ్రహణం ముగిసిన తర్వాత తల స్నానాలు కూడా చేస్తారు.

English summary
The last solar eclipse of the year will occur on December 14 that is Monday. Solar eclipses besides being an astronomical occurrence, also hold religious significance in India as practices like astrology and even superstitious practices are associated with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X