వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

38 ఏళ్ల తర్వాత సియాచిన్‌లో అదృశ్యమైన సైనికుడి అవశేషాలు లభ్యం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 1984లో సియాచిన్‌లో అదృశ్యమైన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన సైనికుడి అవశేషాలు 38 ఏళ్ల తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో లభ్యమయ్యాయి. లాన్స్ నాయక్ చంద్రశేఖర్ హర్బోల్ భార్య శాంతి దేవి(63)కి.. సైన్యం 19 కుమావోన్ రెజిమెంట్ అధికారులు ఆదివారం ఈ విషయాన్ని తెలిపారు.

సియాచిన్‌లోని పాత బంకర్‌లో శనివారం మృతదేహం లభ్యమైందని చెప్పినప్పుడు తన మైండ్ బ్లాంక్ అయిందని, ఏమీ చెప్పలేకపోయానని ఆమె అన్నారు. "దాదాపు 38 సంవత్సరాలు. నెమ్మదిగా గత గాయాలన్నీ మళ్లీ తెరుచుకున్నాయి...అతను తప్పిపోయినప్పుడు నాకు 25 ఏళ్లు. మేము 1975లో పెళ్లి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల తర్వాత అతను కనిపించకుండా పోయినప్పుడు నా ఇద్దరు కూతుళ్లు చాలా చిన్నవాళ్లు. ఒకరు నాలుగు, మరొకరు ఏడాదిన్నర సంవత్సరాలు" అని దేవి వెల్లడించారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

 soldiers Remains found 38 years later after he went missing in Siachen

"మేము అతని తర్పణాన్ని నిర్వహించాము [చనిపోయినవారికి నీరు సమర్పించడం], నేను నా జీవితాన్ని నా పిల్లలను పెంచడానికి అంకితం చేసాను. ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఉన్నప్పటికీ, నేను నా పిల్లలను గర్వించే తల్లిగా, అమరవీరునికి ధైర్యసాహసాలు కలిగిన భార్యగా పెంచాను అని దేవి తెలిపారు.

కుటుంబ సభ్యులకు మంగళవారం మృతదేహాం లభించే అవకాశం ఉంది. "అధికారులు, మా గ్రామం, సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఆయనే మా హీరో. దేశం మన సైనికుల త్యాగాలను స్మరించుకుంటున్నందున.. అతని త్యాగం కూడా గుర్తుంచుకుంటుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆమె అన్నారు.

ప్రస్తుతం 42 ఏళ్ల హర్బోల్ కుమార్తె కవిత మాట్లాడుతూ.. తమకు సంతోషించాలో, బాధగా ఉండాలో తెలియడం లేదని అన్నారు. "అతను వెళ్ళిపోయి చాలా కాలమైంది. అతను చాలా కాలం తర్వాత దొరుకుతారని మేము ఊహించలేదు. ఆర్మీ నంబర్‌తో కూడిన మెటాలిక్ డిస్క్ అతని అవశేషాలను గుర్తించడంలో సహాయపడిందని మాకు చెప్పారు. కానీ కనీసం ఇప్పుడు మనం ఓదార్పు పొందుతాం. హిందూ సాంప్రదాయం ప్రకారం అతని అంత్యక్రియలు నిర్వహిస్తాం. తండ్రి ఇంటికి వచ్చారు కానీ, ఆయన బ్రతికి ఉండి ఇక్కడ అందరితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అని భావోద్వేగానికి గురయ్యారు.

1971లో కుమావోన్ రెజిమెంట్‌లో చేరిన హర్బోల్.. ఐదుగురు సభ్యుల గస్తీలో భాగమైన సమయంలో హిమపాతం సంభవించింది. హర్బోల్ తోపాటు మిగిలిన నలుగురి మృతదేహాలు కనుగొనబడలేదు. ఏప్రిల్ 1984లో ఆపరేషన్ మేఘదూత్‌లో భాగంగా హిమానీనదంలోని వ్యూహాత్మక ప్రాంతాలను పాకిస్తాన్ స్వాధీనం చేసుకోకుండా ఆపడానికి భారతదేశం ముందస్తు చర్యలో ఈ రెజిమెంట్ పనిచేస్తోంది.

English summary
soldier's Remains found 38 years later after he went missing in Siachen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X