వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: సైనికుడు తల్లి అంత్యక్రియలకే బ్రేక్, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు, ఇది మనోళ్ల బుద్ధి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కారవార: దేశం కోసం, దేశ ప్రజల కోసం దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు. అయితే అలాంటి సైనికుడికి కష్టాలు ఎదరైనాయి. అనారోగ్యంతో మరణించిన సైనికుడి తల్లి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ భయంతో సైనికుడి అంత్యక్రియలు నిర్వహించడానికి వీలులేదని స్థానికులు తేల్చి చెప్పారు. పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. ఆ సమయంలో తన తల్లి అంత్యక్రియులు నిర్వించడానికి ఆ సైనికుడు స్థానికుల కాళ్లు పట్టుకున్నా వారు ఏ మాత్రం కనికరించలేదు.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 కారవారలో ఉద్యోగం

కారవారలో ఉద్యోగం

జార్ఖండ్ కు చెందిన సుమిత్ కుమార్ నెహగల్ అనే యువకుడు కర్ణాటక చేరుకుని మంగళూరు సమీపంలోని కారవార (సముద్ర తీర ప్రాంతం)లోని Navyలోని సీబర్డ్ లో సైనికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా కారవారలో నివాసం ఉంటున్న సుమిత్ కుమార్ నెహగల్ అప్పుడప్పుడు జార్ఖండ్ కు వెళ్లి కుటుంబ సభ్యులను చూసి వస్తున్నాడు.

 తల్లికి అనారోగ్యం

తల్లికి అనారోగ్యం

సుమిత్ కుమార్ నెహగల్ తల్లి అనారోగ్యానికి గురైయ్యారు. సుమిత్ కుమార్ నెహగల్ తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని వైద్యులు చెప్పారు. ఇటీవల జార్ఖండ్ లోని తల్లిని కారవార పిలుచుకుని వెళ్లిన సుమిత్ కుమార్ నెహగల్ ఆమెను కారవారలోని సైనిక స్థావరంలోని పతాంజలి ఆసుపత్రిలో చేర్పించారు.

 చికిత్స విఫలమై తల్లి మృతి

చికిత్స విఫలమై తల్లి మృతి

కొంతకాలం నుంచి పతాంజలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమిత్ కుమార్ నెహగల్ తల్లి మరణించారు. లాక్ డౌన్ కారణంగా జార్ఖండ్ లోని సొంత ఊరికి తల్లి మృతదేహాన్ని జార్ఖండ్ కు తీసుకెళ్లడానికి వీలుకాకపోవడంతో కారవారలో అంత్యక్రియలు నిర్వహించాలని సుమిత్ కుమార్ నెహగల్ నిర్ణయించాడు.

 స్థానికుల అభ్యంతరం

స్థానికుల అభ్యంతరం

తల్లి అంత్యక్రియలు కారవారలోని చెండియా గ్రామ పంచాయితీ పరిధిలోని స్మశాసనవాటికలో నిర్వహించడానికి అధికారుల దగ్గర నుంచి సుమిత్ కుమార్ నెహగల్ అనుమతి తీసుకున్నారు. తీరా స్మశానవాటికలోకి వెళ్లిన సుమిత్ కుమార్ నెహగల్ తల్లి అంత్యక్రియలకు అన్ని సిద్దం చేసుకుంటున్న సమయంలో స్థానికులు అడ్డుకున్నారు.

 పోలీసులు చెప్పినా డోంట్ కేర్ !

పోలీసులు చెప్పినా డోంట్ కేర్ !

తన తల్లి కిడ్నీ వ్యాధితో మరణించారని, ఆమెకు కరోనా వైరస్ సోకలేదని, వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని, అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సైనికుడు సుమిత్ కుమార్ నెహగల్ స్థానికుల కాళ్లు పట్టుకున్నాడు. అయితే తమకు కరోనా వైరస్ వ్యాపిస్తోందని భయంగా ఉందని ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వమని స్థానికులు తేల్చిచెప్పారు.

Recommended Video

Telangana New Secretariat పై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రజాధనం వృథా | MLA Jagga Reddy ఆవేదన...!!
 పగవాళ్లకు కూడా ఈ కఫ్టాలు వద్దు స్వామి

పగవాళ్లకు కూడా ఈ కఫ్టాలు వద్దు స్వామి

కారవార పోలీసులు జోక్యం చేసుకుని సుమిత్ కుమార్ నెహగల్ తల్లి అంత్యక్రియలు జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని స్థానికులకు పోలీసులు మనవి చేసి చివరికి విఫలం అయ్యారు. చివరికి జనశక్తి సంస్థ అధ్యక్షుడు మాధవనాయక్ ముందుకు వచ్చి కారవారలోని సర్వోదయనగర్ లోని స్మశాన వాటిలో సైనికుడు సుమిత్ కుమార్ నెహగల్ తల్లి అంత్యక్రియలు పూర్తి చేయించారు. కరోనా వైరస్ దెబ్బకు ప్థానికులు అడ్డు చెప్పడంతో సైనికుడు సుమిత్ కుమార్ నెహగల్ విచారం వ్యక్తం చేశారు.

English summary
Coronavirus: Soldier working in karwar navy has struggled to perform his mother's funeral because of locals opposition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X