వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: ఉగ్రవాదులను మట్టుబెట్టాక సంబురాల్లో భారత జవాన్లు

|
Google Oneindia TeluguNews

రంబన్ : జమ్మూకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కొందరి పౌరులను బంధీలుగా చేసి ఒక గదిలో బంధించారు ఉగ్రవాదులు. సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు దాదాపు 5 గంటల పాటు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. బంధీలను సురక్షితంగా సైన్యం బయటకు తీసుకొచ్చింది.

రంబన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అవడంతో సైనికులు సంబురాలు చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సైన్యం నినాదాలు చేసింది. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఐదుగంటల పాటు సాగిన ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని ముగ్గురు ఉగ్రవాదులు హతం అయినట్లు ఆర్మీ అధికారి అధికారిక ప్రకటన చేశారు. అంతేకాదు బంధీలుగా ఉన్న పౌరులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. మరోవైపు ఆపరేషన్‌లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని ఎదురుకాల్పుల్లో ఒకరు జవాను అమరుడైనట్లు ఆర్మీ వెల్లడించింది.

Soldiers celebrate after gunning down three terrorists

అంతకుముందు పౌరుల కోసం జరిపిన సెర్చ్ ఆపరేషన్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ముగ్గురు ఉగ్రవాదులు పౌరులను తీసుకుని ఓ ఇంట్లోకి నక్కినట్లు అధికారులు వివరించారు. భద్రతా బలగాలపైకి గ్రెనేడ్లతో దాడి చేశారని ఆ తర్వాత కాల్పులకు దిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదులు లొంగిపోవాల్సిందిగా పలుమార్లు చెప్పినప్పటికీ వారు వినకపోవడంతో ఆపరేషన్ మొదలు పెట్టి పూర్తి చేశామని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రెండో ఎన్‌కౌంటర్ గందెర్‌బాల్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. గందెర్‌బాల్ ప్రాంతం గురెజ్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైనట్లు నార్తర్న్ కమాండ్ ట్వీట్ చేసింది. హతమైన ఉగ్రవాది సరిహద్దు రేఖ నుంచి భారత్‌లోకి చొరబడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేసింది సైన్యం. మూడో ఘటన శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. అక్కడ ఉగ్రవాదులు గ్రెనేడ్‌లు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

జమ్మూకశ్మీర్‌లో గురువారం అజిత్ దోవల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులను వేరిపారేసే కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని కోరారు. సరిహద్దుల్లో చాలా మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని అజిత్ దోవల్ అలర్ట్ చేశారు.

English summary
Indian Army troops celebrated after gunning down of three terroists and saving the hostages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X