వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రోజే పనికానిచ్చేయండి: బ్యాంకులకు 5రోజుల వరుస సెలవులు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వచ్చే వారంలో బ్యాంకులకు 5 రోజులు సెలవు.. ఇది నిజమేనా?

న్యూఢిల్లీ: వరుస సెలవులు, సమ్మెల నేపథ్యంలో ఐదు రోజులపాటు బ్యాంకులు తెరుచుకునే అవకాశం లేదు. మీకేవైనా బ్యాంకు పనులుంటే ఈ రోజే చేసుకోండి. లేదంటే రేపటి(సెప్టెంబర్1) నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు తెరుచుకోవు. శనివారం పనిదినమైనా కొన్ని రాష్ట్రాల్లో సెలవే. మరికొన్ని రాష్ట్రాల్లో ఒక పూట మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

Some Banks May Be Closed For First 5 Days In September. Heres Why

సెప్టెంబర్ 2వ తేదీ ఆదివారం. 3వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. 4, 5 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం (యూఎఫ్ఆర్‌బీవోఈ) సమ్మెకు పిలుపునిచ్చింది.

ఆ రెండు రోజులు భారతీయ రిజర్వు బ్యాంకు సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా దేశ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు తెరుకున్నా లావాదేవీలు జరగకపోవచ్చు. అంటే, మొత్తంగా ఐదు రోజులు బ్యాంకులు పనిచేయనట్లే. అందుకే శుక్రవారమే బ్యాంకుల్లో మీ పని ముగించుకుంటే మంచిది.

అలా ఏం లేదు: కేంద్రం

కాగా, వచ్చే వారంలో బ్యాంకులకు అదనపు సెలవులేమీ లేవని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. తాజాగా ఐదురోజుల సెలవుల వార్తలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు సాధారణ సెలవులు మినహా మిగతా రోజుల్లో యథావిధిగా పనిచేస్తాయని స్పష్టతనిచ్చింది.

English summary
After social media buzz that a weekend followed by Janmashtami and a two-day bank strike by Reserve Bank of India employees could paralyse banking operations in several parts of the country from September 1 to September 5, National Organization of Bank Workers Vice President Ashwani Rana has clarified that banks will largely remain open there will be no impact on the functioning of ATMs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X