వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఏడు దాటితే అమ్మాయిలు ఉండకూడదు, చిరిగిన జీస్స్ వేసుకోకూడదు

అమ్మాయిలు ధరించే దుస్తులపై ముంబాయిలోని కొన్ని కాలేజీలు ఆంక్షలను విధించాయి. ఏడు గంటల తర్వాత విధ్యార్థినులు కాలేజీ క్యాంపస్ లో ఉండకూడదని సూచించాయి.ఈ ఆంక్షల పట్ల విధ్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై :అమ్మాయిలు వేసుకొనే దుస్తులపై ముంబాయిలోని కొన్ని కాలేజీలు ఆంక్షలు విధించాయి.ఫ్యాషన్ కోసం కత్తిరించుకొన్న జీన్స్ ,స్లీవ్ లెస్ క్లాత్స్ ,షార్ట్స్ వేసుకొని అమ్మాయిలు , అబ్బాయిలు కాలేజీ క్యాంపస్ లోకి రాకూడదని నిబంధనలు విధించాయి.

ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ ,విల్సన్ కాలేజీతో పాటు మరికొన్ని కాలేజీలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. కాలేజీ యాజమాన్యాలు దుస్తులపై ఆంక్షలు విధించడంపై విధ్యార్థులు నిరసన తెలుపుతున్నారు.

some colleges apply conditions for students in mubai

అక్కడక్కడ కట్ చేసి ఉన్న జీన్స్ ను వేసుకొని కాలేజీకి వచ్చిన విధ్యార్థిని కాలేజీ గేట్ వద్దే సెక్యూరిటీ గార్డు అడ్డుకొన్నారు. కొన్ని కాలేజీల్లో అమ్మాయిలకు సమయ నిబంధన కూడ విధించారు.

రాత్రి ఏడు తర్వాత కాలేజ్ క్యాంపస్ లో అమ్మాయిలు ఉండకూడదని ఆంక్షలు విధించారు. క్యాంపస్ లైబ్రరీ లేదా ల్యాబ్ లలో ఎక్కడ అమ్మాయిలు ఉండకూడదని సూచించారు.ఈ రకమైన నిబంధనల వల్ల తమ స్వేఛ్చను హరించివేస్తున్నారని విధ్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

English summary
some colleges apply conditions for students in mubai, ripped jeans, sleeveless clothes, shorts were not allowed in to colleges. saint javiers college, wilson college students were implent this conditions. students protest about this conditions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X