వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించం... ఇప్పటికే కొందరు జైలుకెళ్లారన్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. 2.0 ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని .. అవినీతి పరుల ఇప్పటికే తమ చోటుకు చేరుకున్నారని చెప్పారు. వారిని జైలుకు పంపించామని మోడీ పరోక్షంగా చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తూ ... సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో వేల్లానుకొన్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఇవాళ జార్ఖండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

జార్ఖండ్‌లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. పేదలు, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. చట్టానికి అందరు సమానమేనని .. ఎవరూ అతీతుల కాదని స్పష్టంచేశారు. అవినీతి పరులు ఇప్పటికే జైలుకు చేరారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తీహర్ జైలుకు చేరిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కూడా సిట్ విచారణను ఎదుర్కొంటున్నానని గుర్తుచేశారు.

Some corrupt people put in their place,’ PM Modi

మోడీ 2.0 క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి .. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని చెప్పారు. దీంతోపాటు ట్రిపుల్ తలాక్ చట్టబద్దం చేశామి పేర్కొన్నారు. దీంతో ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని వివరించారు. మరోవైపు కొత్త మోటారు వాహన చట్టంతో ... రోడ్డు ప్రమాదాలు తక్కువై ... రహదారి భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్‌తో దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నామన వివరించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday asserted that his government has taken several measures in the first 100 days of NDA 2.0 to rein in corruption, expand welfare schemes, bring about development and root out terrorism. The prime minister inaugurated several projects and said Jharkhand was like a launching pad for big schemes to aid the poor and the tribals. Referring to the action taken by the law enforcement agencies against some prominent people and politicians, the Prime Minister said no one was above law. “We pledge to rein in corruption, fight for the rights of Muslim sisters and root out terrorism. Some corrupt people have already been put in their place (jail),” PTI quoted the PM as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X