వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్నింటికే అనుమతి: మరికొన్నింటికి నో, తెరిచే షాపులేవీ, క్లోజ్ కంటిన్యూ అయేవి ఏవీ.. ఆ జాబితా ఇదే...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకు మెడికల్ షాపులు పూర్తిగా, కిరాణా షాపులు పరిమితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచేందుకు అనుమతించింది. అందుకు గల షరతులు కూడా విధించింది. దీంతో ఏయే షాపులు ఓపెన్ ఉంటాయో, ఏవీ మూసివేస్తారో తెలుసుకుందాం.. పదండి.

Recommended Video

Coronavirus Lockdown : Home Ministry Allows Reopening Of All Shops, Coditions Apply!
50 శాతం సిబ్బంది

50 శాతం సిబ్బంది

రద్దీ దృష్ట్యా మున్సిపాలిటీ పరిధి ముగిసిన తర్వాత గల నివాస సముదాయాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మున్సిపాలిటీలో గల మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ తెరవబోమని స్పష్టంచేసింది. కరోనా వైరస్ హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితి యథతథాంగా కొనసాగుతోందని పేర్కొన్నది. ఏప్రిల్ 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్ర హోంశాఖ సవరణలు చేసింది. ఆయా వ్యాపార సముదాయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలని షరతు విధించింది. దీంతోపాటు వారు మాస్క్ వేసుకొని, సామాజిక దూరం పాటించాలని స్పష్టంచేసింది.

మద్యం షాపులకు నో..

మద్యం షాపులకు నో..

ఆయా షాపు యాజమానులు తమ 50 శాతం మంది సిబ్బంది జాబితాతో.. మాస్క్ వేసుకొని, సామాజిక దూరం పాటిస్తామని కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో ఏ వ్యాపార సముదాయం తెరుచుకోదు అని స్పష్టంచేసింది. మద్యం షాపులు కూడా తెరబోమని స్పష్టంచేసింది.

ఓపెన్ చేసేవి ఇవే:

ఓపెన్ చేసేవి ఇవే:

1. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతంలో రిజిష్ర్ చేసుకున్న షాపులు తెరిచేందుకు అనుమతించారు. కానీ మున్సిపాలిటీ దాటిన దాటి, అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంటే మాత్రం తెరవడానికి అనుమతిస్తారు.

2.మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీలో పరిమిత స్థాయిలో షాపులకు పర్మిషన్ ఇచ్చారు.

3. ఆయా వ్యాపార సముదాయాల్లో 50 శాతం సిబ్బందికి మించి పనిచేయొద్దనే నిబంధన విధించారు. వారు మాస్క్ వేసుకొని.. సోషల్ డిస్టన్స్ పాటించాలని సూచించారు

4.సెల్లూన్లు, బ్యూటీపార్లర్ తెరిచేందుకు అనుమతించారు. దీంతో సెలూన్లు తెరవాలని కోరుకునేవారికి ఉపశమనం కలిగింది.

5.గ్రామీణ, సెమీ రూరల్ ప్రాంతాల్లో అన్ని మార్కెట్ సముదాయాలు తెరిచేందుకు ఓకే

6.పట్టణ ప్రాంతాల్లో గల నివాస సముదాయాల్లో ఇతర వస్తువుల కొనుగోలు అందుబాటులోకి వస్తాయి.

7.గ్రామాల్లో అత్యవసరం కానీ సరుకులను కూడా అన్ని షాపుల్లో విక్రయించేందుకు అనుమతిచ్చారు.

8.మున్సిపాలిటీ పరిధి దాటక అన్ని మార్కెట్ కాంప్లెక్స్ తెరిచేందుకు అనుమతి.

9. వైరస్ ఉన్న ప్రాంత సమీపంలో గల ప్రాంతాల్లో ఉన్న షాపులు తెరిచేందుకు అనుమతి

క్లోజ్ చేసేవి ఇవే..

క్లోజ్ చేసేవి ఇవే..

1. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటకా గల మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతి లేదు.

2. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షాపింగ్ మాల్స్ క్లోజ్ కొనసాగుతోంది.

3.సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, జిమ్స్, సోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, ఎంటర్ టైన్ మెంట్ పార్క్, థియేటర్లు, బార్లు, ఆడిటోరియం తెరవరు.

4.పెద్ద షాపులు, వ్యాపార సముదాయాలకు కూడా తెరిచేందుకు అనుమతి లేదు.

5.చిన్న పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ కాంప్లెక్స్ కూడా మూసివేస్తారు.

English summary
The concession, however, has not been extended to shops in market places, multi-brand, and single-brand malls located in municipality areas, coronavirus hotspots and containment areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X