వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ పాఠాల లేడీ ప్రొఫెసర్ మీద జైల్లో ఖైదీల దాడి !, బెయిల్ కోసం డ్రామాలా ?, అసలేం జరిగింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చెయ్యడంతో అరెస్టు అయిన లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవి మీద మదురై సెంట్రల్ జైల్లో ఖైదీలు దాడి చేశారని శుక్రవారం ఆమె న్యాయవాది పశుమ్ పొన్ ఆరోపించారు. నిర్మలా దేవికి జైల్లో భద్రత కల్పించాలని, అక్కడే ఉంటే మళ్లీ ఖైదీలు దాడి చేసే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చెయ్యాలని నిర్మలా దేవి న్యాయవాది పశుమ్ పొన్ కోర్టును ఆశ్రయించారు. అయితే నిర్మలా దేవికి ప్రత్యేక బ్యారెక్ కు తరలించామని, సాటి ఖైదీలు దాడి చేసే అవకాశం లేదని జైలు సిబ్బంది అంటున్నారు.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

కోర్టు ఆదేశాలతో సెంట్రల్ జైలు

కోర్టు ఆదేశాలతో సెంట్రల్ జైలు

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేసిందని నమోదైన కేసులో శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరిగుతున్న లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మలాదేవిని 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆమెను మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.

అందమైన అమ్మాయిలు టార్గెట్

అందమైన అమ్మాయిలు టార్గెట్

తమిళనాడులోని అరుప్పు కోటై డిగ్రీ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేసిన నిర్మలా దేవి మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు సీనియర్ అధికారులకు లైంగిక కోరికలు తీరిస్తే పరీక్షల్లో మీకు మంచి మార్కులు వేస్తారని, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారని, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటానని, మీకు అన్ని విదాలుగా నేను అండగా ఉంటానని అందమైన కాలేజ్ అమ్మాయిలకు ప్రొఫెసర్ నిర్మలా దేవి ఎర వేసింది.

ధైర్యం చేసిన విద్యార్థిని

ధైర్యం చేసిన విద్యార్థిని

మదురై కామారాజర్ యూనివర్శిటి అధికారులకు లైంగిక వాంచ తీర్చాలని నిర్మలా దేవి ఫోన్ చేసి రెచ్చగొట్టిన సమయంలో ఓ కాలేజ్ అమ్మాయి మొబైల్ లో రికార్డు చేసింది. ఆ ఆడియో బయటకు రావడంతో గత సంవత్సరం నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిర్మలా దేవి నోరు విప్పకుండా చేయడం లక్షంగా అనేక మంది పెద్దలు ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. నిర్మలా దేవికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసుల విచారణకు సహకరించాలని, కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుకావాలని కోర్టు షరతులు పెట్టింది

అందరూ దూరం అయ్యారు

అందరూ దూరం అయ్యారు

బెయిల్ పై బయటకు వచ్చిన నిర్మలా దేవిని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నిర్మలా దేవిని చీదరించుకున్నారు. విదిలేని పరిస్థితిలో నిర్మలా దేవి ప్రస్తుతం ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్టు విచారణకు హాజరౌతున్న నిర్మలా దేవి అందర్నీ భయపెట్టే రీతిలో విచిత్రంగా ప్రవర్తిస్తోంది.

కోర్టు చెప్పినట్లు వినకుండా !

కోర్టు చెప్పినట్లు వినకుండా !

నిర్మలా దేవి కోర్టు విచారణకు సక్రమంగా హాజరుకాకపోవడంతో శ్రీవిళ్లిపుత్తూరు మహిళా కోర్టు న్యాయమూర్తి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తే ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తావా అంటు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు విచారణకు వరుసగా డుమ్మా కోట్టిన నిర్మలా దేవికి మంజూరు చేసిన బెయిల్ ను కోర్టు రద్దు చెయ్యడంతో అరెస్టు చేసి మళ్లీ మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.

English summary
Tamil Nadu: Someone has attacked professor Nirmaladevi in jail, says lawyer Pasumpon Pandian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X