బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏమైనా జరగచ్చు, ప్రభుత్వం ఆయుష్యు అంతేనా ? బళ్లారి శ్రీరాములు ఎందుకన్నారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/గదగ్: రేపు ఏమైనా జరగవచ్చు, ఆరోజు నేను ఆరోగ్య శాఖా మంత్రిగా ఉంటానో ? ఉండనో ? తెలీదు, మూడు నెల్లలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు అన్నీ సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశం దుర్వినియోగం అయితే తరువాత మీరే భాదపడవలసి వస్తోందని మంత్రి బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాఖ పరిధిలో ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. మంత్రి బళ్లారి శ్రీరాములు ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ? ఈ ప్రభుత్వం ఆయుష్యు అంతేనా ? అనే విషయం అంతుచిక్కక ఇటు బీజేపీ వర్గాలు అయోమయానికి గురౌతున్నారు.

భార్య అక్రమ సంబంధం, గ్యాస్ సిలిండర్ పేలి భర్త, కుమార్తెలు మృతి, ఏం జరిగిందంటే !భార్య అక్రమ సంబంధం, గ్యాస్ సిలిండర్ పేలి భర్త, కుమార్తెలు మృతి, ఏం జరిగిందంటే !

ప్రభుత్వం ఆయుష్యు అంతేనా ?

ప్రభుత్వం ఆయుష్యు అంతేనా ?

మంత్రి బళ్లారి శ్రీరాములు వ్యాఖ్యలతో కర్ణాటకలోని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆయుష్యు కేవలం ఇక మూడు నెలలు మాత్రమేనా ? అనే అనుమానం వ్యక్తం అవుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. లేకపోతే మంత్రి శ్రీరాములు స్థానంలో ఆరోగ్య శాఖా మంత్రిగా మరెవరైనా వస్తున్నారా ? అనే ప్రశ్న ఎదురైయ్యింది. అయితే మంత్రి బళ్లారి శ్రీరాములు వ్యాఖ్యలు కట్టీ విరగలేదు, పామూ చావలేదు అనే సామెతలా ఉందని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.

సమాజం నాశనం అయ్యింది !

సమాజం నాశనం అయ్యింది !

మనం అన్ని విధాలుగా చాలా మారాలి, నేను కూడా తన శైలిని మార్చుకోవాలి, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తన శైలి మార్చుకోవడం సాధ్యం కాదని మంత్రి శ్రీరాములు చెప్పారు. మరో వైపు సమాజనం నాశనం అవుతోందని, సమాజాన్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే మనం అందరూ కలిసికట్టుగా పని చెయ్యాలని మంత్రి శ్రీరాములు ప్రజలకు పిలుపునిచ్చారు.

నేను ఉంటానో ? ఉండనో

నేను ఉంటానో ? ఉండనో

గదగ్ లో మంత్రి శ్రీరాములు అధికారులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. నేను రేపు ఆరోగ్య శాఖా మంత్రిగా ఉంటానో ? ఉండనో ? అనే విషయం తెలీదని మంత్రి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మూడు నెలల్లో తన శాఖలోని ప్రభుత్వ నిధులు అన్నీ ఖర్చు చేసి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని, అందుకు మీ అందరి సహకారం కావాలని తాను మనవి చేస్తున్నానని మంత్రి శ్రీరాములు చెప్పారు.

రాజకీయ వ్యవస్థ చెడిపోయింది !

రాజకీయ వ్యవస్థ చెడిపోయింది !

తన రాజకీయ జీవితంలో ఇంకా చాలా మార్పులు రావాలని కోరుకుంటున్నానని, అయితే ఇప్పుడు అది సాధ్యం కావడంలేదని మంత్రి శ్రీరాములు అన్నారు. మరోవైపు సమాజం చెడుదోవ పడుతోందని మంత్రి శ్రీరాములు విచారం వ్యక్తం చేశారు. మనుషులను పోగిడితే ఏం లాభం లేదని. ఇక్కడ ఎవ్వరూ శాస్యతం కాదని, భగవంతుడి ఆశీర్వాదంతో అందరికీ మంచి చెయ్యాలని మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు.

జిల్లాకు రూ. 20 కోట్లు, మొత్తం రూ. 2,000 కోట్లు

జిల్లాకు రూ. 20 కోట్లు, మొత్తం రూ. 2,000 కోట్లు

ప్రస్తుతం తన శాఖలో ఒక్కొక్క జిల్లాలో రూ. 20 కోట్ల వరకూ నిధులు మూలుగుతున్నాయని, వాటిని మీరు ఎలా ఖర్చు చేస్తారని మంత్రి శ్రీరాములు అధికారులను ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో రూ. 20 కోట్ల నిధులు ఖర్చు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2. 000 కోట్ల నిధులు మంజూరు చేస్తారని, ఆ నిధులు ఎన్ఆర్ హెచ్ఎం పథకం కింద ఖర్చు చెయ్యడానికి అవకాశం ఉంటుందని. మళ్లీ మనం నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చెయ్యడానికి అవకాశం ఉంటుందని మంత్రి శ్రీరాములు అన్నారు.

English summary
Karnataka: Something Will happened tomorrow I am not be a health minister Says Sriramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X