సోమనాథ్ ఇబ్బందిగా మారాడు, ఎంత దూరం పరుగెడతాడు: కేజ్రీ
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి పార్టీకి ఇబ్బందికరంగా మారాడని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. సోమనాథ్ భారతిపై ఆయన భార్య లిపికా గృహహింస, హత్యాయత్నం కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ చేసుకున్నారు. న్యాయస్థానం దానిని మంగళవారం కొట్టేసింది. అప్పటి నుంచి సోమనాథ్ కనిపించకుండా పోయారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సోమనాథ్ భారతి వెంటనే పోలీసులకు లొంగిపోవాలన్నారు. ఎంత దూరమని పరిగెడతాడన్నారు. ఆయన పార్టీకి, కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా మారాడని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.

జైలుకు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. సోమనాథ్ భారతి వ్యవహారంపై కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఎందుకు పారిపోతున్నాడో అర్థం కావడం లేదని అభిప్రాయపడ్డారు.
ఎస్పీజీ భద్రత అవసరం లేదు: మన్మోహన్ కూతుళ్లు
నిబంధనల మేరకు, మన్మోహన్ సింగ్‌కు, ఆయన కూతుళ్లకు కేంద్రం ఎస్పీజీ భద్రత కల్పిస్తోంది. అయితే, ఇకపై తమకు ఎస్పీజీ తరహా భద్రత అవసరం లేదని ఆయన కుమార్తెలిద్దరూ కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు.
ఇప్పటికే మన్మోహన్ పెద్ద కుమార్తె, రచయిత్రి దామన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రత స్థానంలో ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఢిల్లీ వర్సీటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మన్మోహన్ చిన్న కుమార్తె ఉపిందర్ సింగ్ కూడా ఎస్పీజీ భద్రత అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసింది.












Click it and Unblock the Notifications