వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) కన్నుమూత: పేదల గొంతుక అంటూ మోడీ సంతాపం

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి కోల్‌‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Somnath Chatterjee, Former Lok Sabha Speaker, Dies At 89

ఆదివారం గుండెపోటు రావడం పరిస్థితి విషమంగా మారింది. దీంతో సోమవారం ఉదయం ఆయన మృతి చెందారు. సోమ్‌నాథ్ ఛటర్జీ 10సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1968లో సీపీఎంలో చేరారు చటర్జీ.

2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. కాగా, యన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ.. సోమ్‌నాథ్ ఛటర్జీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రటించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని ప్రధాని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛటర్జీ మృతి పట్ల తీవ్ర సాంతాపం వ్యక్తం చేశారు.

English summary
Former Lok Sabha speaker Somnath Chatterjee died today morning in Kolkata days after he was admitted to hospital with a kidney ailment. He was 89 years old. Mr Chatterjee, who was admitted to Belle Vue hospital on August 8, was put on ventilator support after he suffered a heart attack. His condition turned critical on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X