వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాల్ సలామ్: సోమ్‌నాథ్ కమ్యూనిస్టుగానే జీవించారు... కమ్యూనిస్టుగానే కన్నుమూశారు

|
Google Oneindia TeluguNews

సోమ్‌నాథ్ ఛటర్జీ... ఈ పేరు వింటే మనకు ముందుగా గుర్తొచ్చేది లోక్‌సభ. ఆ పదవికే వన్నె తెచ్చారు ఈ కమ్యూనిస్ట్ శిఖరం. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. సోమ్‌నాథ్ ఛటర్జీ మరణంతో కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు ఏర్పడింది. అందుకే సోమ్‌నాథ్ ఛటర్జీ ఎప్పటికీ గుర్తుండిపోతారు.

ఇక ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయనో విజ్ఞాన పుస్తకం. పేదవారి కోసం నిలబడి పోట్లాడిన గొప్ప వ్యక్తి. ఇప్పటి వరకు భారత దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక కమ్యూనిస్ట్ నేత రాజ్యాంగ పదవిని చేపట్టిన దాఖలాలు లేవు. అలాంటి సోమ్‌నాథ్ ఛటర్జీ మాత్రమే 2004లో లోక్‌సభ స్పీకర్ బాధ్యతలు చేపట్టారు. కేంబ్రిడ్జిలోని జీసస్ కాలేజ్ నుంచి న్యాయశాస్త్రం చదివారు సోమ్‌నాథ్ ఛటర్జీ. ఆ సమయంలోనే కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదాలు హోరెత్తేవి. పలు పరిశ్రమల వద్ద కార్మికులు తమ పోరాటం సాగించేవారు. కమ్యూనిస్ట్ నినాదాల మధ్యే సోమ్‌నాథ్ చదువు కొనసాగింది.

తండ్రి హిందూ వాది... సోమ్‌నాథ్ కరుడుగట్టిన కమ్యూనిస్ట్

తండ్రి హిందూ వాది... సోమ్‌నాథ్ కరుడుగట్టిన కమ్యూనిస్ట్

సోమ్‌నాథ్ ఛటర్జీ తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. కలకత్తా హైకోర్టు లాయరుగా జీవితం ప్రారంభించారు. అనతి కాలంలోనే పెద్ద పేరున్న న్యాయవాదిగా సోమ్‌నాథ్ ఛటర్జీ గుర్తింపు పొందారు. తండ్రి అఖిల భార తీయ హిందూ మహాసభలో సభ్యుడు. కానీ ఛటర్జీ మాత్రం కమ్యూనిస్ట్ యోధుడు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు నుంచి స్ఫూర్తి పొంది ఎర్రకండువా ధరించారు. న్యాయవాదిగా చాలామంది కమ్యూనిస్టుల తరపున ఎలాంటి రుసుం లేకుండా కేసులు వాదించి విజయం సాధించారు. ఆయన వాక్చాతుర్యం, మేధావితనం, ధర్మగుణం ఆయనకు తొలిసారిగా లోక్‌సభకు పంపేలా చేశాయి. అతేకాదు సీపీఎం సెంట్రల్ కమిటీలో కీలక బాధ్యతలు ఆయన చేతికి వచ్చాయి.

సోమ్‌నాథ్ చొరవతోనే పురుడు పోసుకున్న యూపీఏ

సోమ్‌నాథ్ చొరవతోనే పురుడు పోసుకున్న యూపీఏ

సోమ్‌నాథ్ ఛటర్జీ లోక్‌సభలో ఉంటే ఆ హుందాతనమే వేరు. అతను చదివిన న్యాయశాస్త్రం ఆయన చేసే ప్రసంగంలో కనిపిస్తుంది, ఆయనకన్న రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ బీజేపీలను బుల్డోజ్ చేశారు. 10సార్లు లోక్‌సభకు ఎన్నికైన సోమ్‌నాథ్ ఛటర్జీ ఢిల్లీలోనే ఎక్కువగా గడిపినా హిందీ మాట్లాడటంలో మాత్రం వెనకపడిపోయారు. 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ చాలా బలంగా ఉంది. అయితే వ్యూహరచనలు చేసేందుకు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని నేరుగా కలిసి మాట్లాడేందుకు విపక్ష పార్టీ నాయకులు భయపడేవారు. కానీ సోమ్‌నాథ్ ఛటర్జీ మాత్రం తన పార్టీ అధిష్టానానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా... ఎటువంటి అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా వెళ్లి సోనియాను కలిసి ఉన్న పరిస్థితిని వివరించారు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక సోనియాగాంధీతో సోమ్‌నాథ్ ఛటర్జీ మాట్లాడాకా.. విపక్షాలతో చరిత్రాత్మక సమావేశం ఆగష్టు 14, 2003న జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీలోని ఛటర్జీ నివాసమే వేదికైంది. ఈ మీటింగ్‌లో సోనియాగాంధీతో పాటు కమ్యూనిస్ట్ నేతలు జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జీత్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడలు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే యూపీఏ పురుడు పోసుకుంది.

 జీవితంలోనే కఠిన పరీక్ష ఎదుర్కొన్న సోమ్‌నాథ్

జీవితంలోనే కఠిన పరీక్ష ఎదుర్కొన్న సోమ్‌నాథ్

ఐదేళ్ల తర్వాత అంటే 2008లో సోమ్‌నాథ్ ఛటర్జీ తన జీవితంలోనే ఒక కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన వెంటనే రాజీనామా చేసి యూపీఏ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో వ్యతిరేకంగా ఓటువేయాలని సీపీఎం నుంచి ఒత్తిడి వచ్చింది. అధిష్టానం నిర్ణయాన్ని తప్పకుండా పాటించాల్సిందేనని ఆనాడు సీతారాం ఏచూరి, బుద్ధదేబ్ భట్టాచార్యలు మరింత ఒత్తిడి చేశారు. మొహ్మద్ సలీం, నిలోత్పాల్ బసులాంటి నేతలు సోమ్‌నాథ్ ఛటర్జీకి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పార్టీ నిర్ణయంతో విబేధించిన సోమ్‌నాథ్ ఛటర్జీ స్పీకర్ పదవి నుంచి తప్పుకునేందుకు తిరస్కరించారు.

జూలై 24, 2008లో ప్రకాష్ కారత్ నేతృత్వంలోని పొలిట్ బ్యూరో సమావేశం సోమ్‌నాథ్‌పై జీవితకాలం పాటు వేటు వేసింది. ఇక అప్పటి వరకు "బ్రదర్" "కామ్రేడ్"అని తోటి సభ్యులను పిలిచిన సోమ్‌నాథ్ ఛటర్జీ... ఇక ప్రతి సమావేశాల్లోనూ సభ్యులను "మిస్టర్" "మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ " అని పిలిచేవారు. అందుకే కమ్యూనిస్ట్‌గా సోమ్‌నాథ్ ఛటర్జీని వేరు చేయొచ్చేమో కానీ... కమ్యూనిజంను సోమ్‌నాథ్ ఛటర్జీ నుంచి వేరు చేయలేరు అని అప్పట్లో చెప్పేవారు. ఇక అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీని ఏ వేదికపైనా ఆయన విమర్శించలేదు. సీపీఎం జనరల్ సెక్రటరీగా సీతారాం ఏచూరి ఎంపిక ఖరారు కాగానే ముందుగా ఆయన కలిసింది సోమ్‌నాథ్ ఛటర్జీనే.

కమ్యూనిస్టుగానే జీవించారు..కమ్యూనిస్టుగానే కన్నుమూశారు

కమ్యూనిస్టుగానే జీవించారు..కమ్యూనిస్టుగానే కన్నుమూశారు

సోమ్‌నాథ్ ఛటర్జీని తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా చాలామంది అనేకసార్లు కోరారు. అయితే తాను స్పీకర్ పదవికి రాజీనామా చేయకుండా ఉండడంలో తను ఎలాంటి తప్పు చేయలేదని... తిరిగి పార్టీలోకి తీసుకోవాల్సిందిగా ఎవరినీ అడుగనని పలు సందర్భాల్లో చెప్పినట్లు పొలిట్ బ్యూరో సభ్యులు సలీం గుర్తుచేసుకున్నారు. పార్టీలోకి తిరిగి రావాలని చాలాసార్లు కోరినట్లు గుర్తుచేసుకున్న ఏచూరి... సోమ్‌నాథ్ మాత్రం తిరస్కరించేవారని.. జీవితం ఇలానే సాగనివ్వండని చెప్పేవారని ఏచూరి తెలిపారు. కమ్యూనిస్టుగా బతకాలి.. కమ్యూనిస్టుగానే కన్నుమూయాలి అనే అర్థానికి నిజమైన నిర్వచనం సోమ్‌నాథ్ ఛటర్జీ. కమ్యూనిస్టులానే జీవించారు.. కమ్యూనిస్ట్ భావజాలాలతోనే కన్నుమూశారు సోమ్‌నాథ్. అందుకు పార్టీలోనే ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైనా.. అవే సిద్ధాంతాలతో సోమ్‌నాథ్ ఛటర్జీ మిగతా జీవితాన్ని గడిపారు.

English summary
Somnath Chatterjee followed his father’s footsteps to become a leading lawyer in the Calcutta High Court. His father was a staunch Akhil Bharatiya Hindu Mahasabha member, but Chatterjee, inspired by late Jyoti Basu, joined its arch rival, Communist Party of India (Marxist) or CPI-M. The former Lok Sabha speaker who has died in Kolkata was expelled by the CPI-M, but he never asked to be taken back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X