వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు

|
Google Oneindia TeluguNews

''గడిచిన రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిసి, చాలా ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్, ఆయన మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వానలు ప్రారంభమయ్య నాటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఏపీ సీఎంను పిలిపించి మాట్లాడారు. కానీ ఆ సూచనలను జగన్ వినిపించుకోలేదు. దాని ఫలితంగా ఇవాళ జనం కష్టాల్లో కూరుకుపోయారు. కనీసం వరద నష్టం అచనాలను కూడా ఏపీ సర్కారు సిద్ధం చేయలేదు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

నిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామనిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామ

కేంద్ర మంత్రితో కాన్ఫరెన్స్

కేంద్ర మంత్రితో కాన్ఫరెన్స్

ఏపీలో భారీ వర్షాలు, వరదలు తలెత్తినా జగన్ సర్కారు పట్టనట్టుగా వ్యవహరించిందని, రెండు వారాలు దాటినా వరద నష్టం అచనాలను రూపొందించలేదని, అసలిక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయని, ఇలాంటి కష్టకాలంలో ఆంధ్రులకు కేంద్రమే అండగా నిలవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాలకు ఏపీ బీజేపీ నేతలు మొరపెట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రితో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ ముఖ్యనేతలు.. ఇక్కడి వరద నష్టంపై ఓ రిపోర్టును మంత్రికి పంపారు.

 ఏపీలో రాజ్యాంగ సంక్షోభం..

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం..

కేంద్ర మంత్రితో కాన్ఫరెన్స్ లో భాగంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ జగన్ పై తీవ్ర ఫిర్యాదు చేశారు. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, అసలు ప్రభుత్వమే లేనట్లుగా పరిస్థితి ఉందని, వర్షాలు, వరదలపై మోదీ, షా ముందుగానే హెచ్చరించినా, సీఎం జగన్ మాత్రం చిన్న లేఖ రాసి చేతులు దులుపుకొన్నారని సుజనా.. కేంద్ర మంత్రి రూపాలతో అన్నారు. ఈ ఏడాది 100 శాతం అధిక వానలు కురిశాయని, ఒక్కరోజులోనే రాష్ట్రమంతటా 32 సెంటీమీటర్ల వాన కురిసిందని, ఇంతటి విపత్తులో ఏపీ మంత్రులెవరూ స్పందించలేదని, కేంద్రం తక్షణమే బృందాలను పంపాలని మరో ఎంపీ సీఎం రమేశ్ కోరారు. ఇక,

జగన్ దారుణ వైఫల్యం..

జగన్ దారుణ వైఫల్యం..

కాన్ఫరెన్సులో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించిందని, కనీసం నష్టాల అంచనానను కూడా సిద్ధం చేయలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పర్యటించాయని, ఇక్కడేం జరుగుతుందో చూడటానికి కేంద్ర బృందాలను పంపాలని ఆయన కోరారు. కాగా, ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గుజరాత్ లో ఉన్నానని, ఎంపీ జీవీఎల్ చొరవ మేరకు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నానని, సాధ్యమైనంత తొందరగా కేంద్రం నుంచి ఏపీకి తగిన న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి రూపాల భరోసా ఇచ్చారు. భేటీ అనంతరం సోము విడిగా వర్చువల్ గానే ప్రెస్ మీట్ నిర్వహించారు..

ఏపీలో భారీ నష్టం..

ఏపీలో భారీ నష్టం..

‘‘భారీ వర్షాల ధాటికి కృష్ణ, గోదావరితోపాటు ఏపీలోని అనేక నదులు, వాగులు, కాలువలు, చెరువులు ఉప్పొంగాయి. చాలా గ్రామాలు నీటమునిగాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి, మిల్లెట్, వేరుశనగ, అరటి, ఉల్లిపాయ వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పార్టీకి చెందిన నాలుగు బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్టం అంచనాలు రూపొందించాయి. ఏపీ రైతుల్ని ఆదుకునేలా కేంద్రం సహాయం చేరాలని కోరాం'' అని సోము వీర్రాజు వివరించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకోవాలని, తక్షణమే రూ.2250కోట్ల సహాయాన్ని అందించాలని, అదేసమయంలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలంటూ ఈనెల 18న సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే.

Recommended Video

Hyderabad: People Helping Children Organization Aiding People Who Are Effected Due Floods

జగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్‌బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామజగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్‌బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామ

English summary
BJP AP Prominent Leaders Interaction with Shri Parshottam Rupala ji Union Minister of State for Panchayati Raj, Agriculture and Farmers Welfare on issues concerning crop damage during floods. AP BJP president Somu veerraju has expressed impatience over Chief Minister Jagan. He said the state government had completely failed in assessing the flood damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X