వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్త అని కనికరించని అల్లుడు, వియ్యంకుడు కూడా ...

|
Google Oneindia TeluguNews

బరేలి : వరకట్న రక్కసి పెనుభూతమవుతోంది. విచక్షణ లేకుండా చేస్తోంది. వావి వరస, మంచి చెడు మరచిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో అలాంటి ఓ ఘటన జరిగింది. తనకు భార్య, పాప కన్న కూడా డబ్బు ఎక్కువని నిరూపించాడు. అదనపు వరకట్నం కోసం తల్లి లాంటి అత్తపై విరుచుకుపడ్డారు. దీంతో ఆమె గాయాలతో ఆస్పత్రి బలైంది. యూపీలోని బరేలి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.

యూపీలోని బరేలి జిల్లాకు చెందిన మహ్మద్ అష్పక్‌కు చాంద్ బీతో ఏడాది క్రితం పెళ్లైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ. 10 లక్షల కట్నం కూడా ఇచ్చారు. అష్పక్ దంపతులకు ఓ పాప కూడా జన్మించింది. పెళ్లై .. పిల్లలు పుట్టాక మారాలి .. పిల్లలే లోకంగా జీవించాలి. కానీ అష్పక్ మనస్సులో మాత్రం వరకట్నం అనే పెనుభూతం నిలిచిపోయింది. తనకు మరో రూ. 5 లక్షల కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది.

son-in-law-attack his anuty.. his father too

భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని తెలిసి చాంద్ బీ తల్లిదండ్రులు కుమార్తె దగ్గరకు వచ్చారు. అష్పక్, అతని తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కోపంతో ఉన్న అష్పక్ అతని కుటుంబసభ్యుల వారి మాటను పట్టించుకోలేదు. చాంద్ బీ తల్లిదండ్రులు నచ్చజెప్పడం .. వారు ఒప్పుకోకపోవడంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన అష్పక్ .. తన అత్తపై దాడి చేశాడు. ఆమె ముక్కును కొరికేశాడు. అతను శాంతించి కాస్క పక్కకు తప్పుకున్నాడో లేడో .. అతని తండ్రి రంగంలోకి దిగాడు. తన వియ్యంకురాలు, సోదరి అని కూడా చూడలేదు. ఆమె చెవిని కోసేసి .. తన ముర్ఖత్వాన్ని చాటుకున్నాడు. అల్లుడు, వియ్యంకుడి ప్రవర్తనతో ఆ అతివ బిత్తరపోయారు. రక్తం పారడంతో ఆమె సృహ కోల్పోయారు. రక్తం కారడంతో నిందితులిద్దరూ పారిపోయారు. అనంతరం బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. గాయపడిన మహిళను వైద్యులు పరీక్షించారు. ఆపరేషన్ నిమిత్తం ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించడంతో ... షిప్ట్ చేశారు.

English summary
Mohammed Ashpak of Bareilly district of UP got married to Chand Bee a year ago. Rs. 10 lakh as dowry. The Ashpaq couple was also born. Married .. Children should be born after birth .. Children should live in the world. But in Ashpak's mind, the fantasy of dowry has ceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X